https://oktelugu.com/

హీరోయిన్ పెళ్లి వార్తలన్నీ రూమర్సే !

బబ్లీ గర్ల్ మెహరీన్ పెళ్లి చేసుకుంటోందని.. ఇప్పటికే మెహ్రీన్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. కాగా నిశ్చితార్థం డేట్ వచ్చేనెల 12న కాంగ్రెస్ నేత భవ్య బిష్ణోయ్ తో జరగనుందని, ఇరు కుటుంబాలు ఇప్పటికే బంధువులందరికి ఎంగేజ్మెంట్ డేట్ గురించి కూడా సమాచారం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. Also Read: ‘ఉప్పెన’ డిజిటల్ రిలీజ్ కూడా ఫిక్స్ ! ఈ భామ ఆరేంజ్జ్ మ్యారేజ్ కే ఒప్పుకొందని, వరుడు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 14, 2021 / 02:13 PM IST
    Follow us on


    బబ్లీ గర్ల్ మెహరీన్ పెళ్లి చేసుకుంటోందని.. ఇప్పటికే మెహ్రీన్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. కాగా నిశ్చితార్థం డేట్ వచ్చేనెల 12న కాంగ్రెస్ నేత భవ్య బిష్ణోయ్ తో జరగనుందని, ఇరు కుటుంబాలు ఇప్పటికే బంధువులందరికి ఎంగేజ్మెంట్ డేట్ గురించి కూడా సమాచారం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.

    Also Read: ‘ఉప్పెన’ డిజిటల్ రిలీజ్ కూడా ఫిక్స్ !

    ఈ భామ ఆరేంజ్జ్ మ్యారేజ్ కే ఒప్పుకొందని, వరుడు భవ్య బిష్ణోయ్… ఇతను హర్యానాకి చెందిన యువ రాజకీయనాయకుడు అని, అతని తండ్రి సీనియర్ కాంగ్రెస్ ఎంపీ అని మొత్తానికి రూమర్స్ పుట్టించారు. అయితే ఈ పెళ్లి పై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. అసలు ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని కూడా ఈ బ్యూటీ నుండి వస్తోన్న సమాచారం. తన పెళ్లి గురించి తనకే తెలియదని, అలాంటిది మంచి ముహూర్తం చూసి డేట్ నిర్ణయిస్తారని వార్తలు వస్తున్నాయని ఇవ్వన్నీ అవాస్తవం అంటూ మెహ్రీన్ చెప్పుకొస్తోందట.

    Also Read: ‘మనోజ్ – బన్నీ’ కలయికలో ‘పుష్ప’ !

    కాగా మెహ్రీన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో “F3” ఒక్కటే చెప్పుకోదగ్గది. తనకు పెళ్లి కంటే కూడా సినిమాలు అంటేనే ఎక్కువ ఆసక్తి అని.. ఎట్టిపరిస్థితుల్లో సినిమాలు మానేయటం జరగదని అంటుందట. నిజానికి మెహ్రీన్ ‘ఎఫ్ 2’ తో భారీ హిట్ కొట్టినా, మెహరీన్ కి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో ఎఫ్ 3 సినిమా ఆమె కెరీర్ కి కీలకం కానుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో రెచ్చిపొయి మరీ నటిస్తోందట ఈ బ్యూటీ. అయితే ఎంత బాగా నటించినా ఆమెకు మాత్రం కాలం కలిసి రాదు అని ఇప్పటికే టాలీవుడ్ లో ఓ పేరు ఉంది. మరి ఈ చిత్రంతో ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఎంతవరకు నిలబడగలుగుతుందో చూడాలి.