https://oktelugu.com/

క‌లెక్ష‌న్ల‌ ‘ఉప్పెన‌’.. నెంబ‌ర్ 1 హీరోగా వైష్ణ‌వ్..!

టాలీవుడ్లో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’లా దూసుకెళ్తున్నాడు! ‘ఉప్పెన’ సృష్టిస్తున్న సునామీ ధాటికి రికార్డులు గ‌ల్లంతైపోతున్నాయి! ఇండ‌స్ట్రీలో నమోదైన రికార్డుల‌న్నీ స‌ముద్రంలో క‌లిసిపోబోతున్నాయి! త్వ‌ర‌లో టాలీవుడ్లోనే నెంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌బోతున్నాడు వైష్ణ‌వ్‌! దానికింకా అతికొద్ది స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది! మ‌రి, ఆ వివ‌రాలేంటో చూసేద్దామా? బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పంజా వైష్ణవ్ హీరోగా పరిచయం అయిన‌ మూవీ ‘ఉప్పెన’. క‌న్న‌డ బ్యూటీ కృతీశెట్టి హీరోయిన్ గా న‌టించింది. తమిళ స్టార్ హీరో విజయ్ […]

Written By:
  • Rocky
  • , Updated On : February 14, 2021 / 02:42 PM IST
    Follow us on


    టాలీవుడ్లో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’లా దూసుకెళ్తున్నాడు! ‘ఉప్పెన’ సృష్టిస్తున్న సునామీ ధాటికి రికార్డులు గ‌ల్లంతైపోతున్నాయి! ఇండ‌స్ట్రీలో నమోదైన రికార్డుల‌న్నీ స‌ముద్రంలో క‌లిసిపోబోతున్నాయి! త్వ‌ర‌లో టాలీవుడ్లోనే నెంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌బోతున్నాడు వైష్ణ‌వ్‌! దానికింకా అతికొద్ది స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది! మ‌రి, ఆ వివ‌రాలేంటో చూసేద్దామా?

    బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పంజా వైష్ణవ్ హీరోగా పరిచయం అయిన‌ మూవీ ‘ఉప్పెన’. క‌న్న‌డ బ్యూటీ కృతీశెట్టి హీరోయిన్ గా న‌టించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రను పోషించారు. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. ఈ నెల 12న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ.. భారీ స‌క్సెస్ దిశ‌గా దూసుకెళ్తోంది.

    Also Read: సరదాల రోజు స్పెషల్ గా “బిగ్ బాస్ ఉత్సవం” !

    భారీ ప్ర‌మోష‌న్స్ న‌డుమ‌.. కావాల్సినంత హైప్ తో రిలీజ్ అయ్యిందీ సినిమా. మెగా హీరో కావ‌డం.. మంచి ప్ర‌మోష‌న్ జ‌ర‌గ‌డంతో ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమా నైజాం హక్కులు రూ. 6 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ. 3 కోట్లు, ఆంధ్రా ప్రాంత హక్కులు రూ 10 కోట్లు వరకూ అమ్ముడు పోయాయి. ఓవర్సీస్‌తో కలుపుకుంటే మొత్తంగా రూ. 20 కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో రూ. 21 కోట్ల వసూళ్లు ల‌క్ష్యంగా రిలీజ్ అయ్యిందీ చిత్రం.

    అయితే.. అంచ‌నాలు అమాంతం పెరిగిపోవడం.. సినిమాపై పాజిటివ్ టాక్ రావ‌డంతో.. భారీ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ప్ర‌స్తుత‌ తీరు చూస్తుంటే.. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించేట్టు క‌నిపిస్తోంది. ఈ సినిమా మొదటి రోజు రూ. 9.35 కోట్లు షేర్ రాబట్టింది. అదేవిధంగా.. రూ. 15.10 కోట్లు గ్రాస్ కూడా సాధించింది. దీంతో ఈ సినిమా పేరిట తొలి రోజు విభాగంలో రికార్డులు నమోదయ్యాయి.

    Also Read: పెళ్లిపీటలపై మోసం చేశారు.. వాలెంటైన్స్ డే రోజు సునీత భర్త షాకింగ్ కామెంట్స్..

    అయితే.. తొలిరోజు పాజిటివ్ టాక్ రావ‌డంతో రెండో రోజు కూడా ఉప్పెన తీవ్ర‌త కొన‌సాగింది. చాలా ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ షోలతో అదరగొట్టేసింది. దీంతో రెండో రోజు రికార్డు స్థాయిలో రూ. 6.86 కోట్లు షేర్ తో రూ. 10.80 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా ఈ రెండు రోజులు కలిపి రూ.16.21 కోట్ల షేర్, రూ. 25.80 కోట్ల గ్రాస్ అందుకుంది ఉప్పెన‌. ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ. 2.32 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.18 కోట్లు, ఈస్ట్‌లో రూ. 63 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.23 కోట్లు, వెస్ట్‌లో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణాలో రూ. 49 లక్షలు, నెల్లూరులో రూ. 23 లక్షలు వ‌చ్చాయి.

    రెండో రోజు రూ. 6.86 కోట్లు షేర్ అందుకోవ‌డం ద్వారా.. రెండు రోజుల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా ఇండ‌స్ట్రీలోనే టాప్ -10 చిత్రంగా నిలిచింది. రెండో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘సాహో’ (రూ. 10.55 కోట్లు) మొదటి స్థానంలో ఉండగా.. ఉప్పెన‌ మూవీ పదో స్థానంలో ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో రిలీజ్ అయ్యిందీ సినిమా. ఉప్పెన బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 21 కోట్లు వసూలు చేయాల్సి ఉండ‌గా.. రెండో రోజుల్లోనే రూ. 16.21 కోట్ల షేర్ రాబట్ట‌డం విశేషం. ఈ లెక్క‌న మరో రూ. 4.30 లక్షలు వసూలు చేస్తే ఈ సినిమా హిట్ జాబితాలో చేరిపోతుంది. అంతేకాదు.. అత్యధిక కలెక్షన్లు సాధించిన డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ చరిత్ర సృష్టిస్తాడు. ప్ర‌స్తుత జోరులో అది విష‌య‌మే కాదు. ఇప్పుడు అంద‌రి దృష్టంతా.. లాంగ్ ర‌న్ లో ఈ మూవీ ఏ స్థాయి క‌లెక్ష‌న్లు సృష్టిస్తుందో అన్న‌దానిపైనే చ‌ర్చించుకుంటున్నారు. సో.. ఆ విధంగా మొద‌టి మూవీలోనే అత్య‌ధిక కలెక్ష‌న్ సాధించిన టాలీవుడ్ హీరోగా వైష్ణ‌వ్ రికార్డు సృష్టించ‌బోతున్నాడ‌న్న‌మాట‌!