Singeetam Srinivasa Rao: దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి…తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఆయన ప్రస్తుతం పాన్ వరల్డ్ వరకు తన హవాని కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో ఒక సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకులందరు సంతోషపడతారు. సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మాస్ ఎలిమెంట్స్ తో పాటు ప్రతి ప్రేక్షకుడిని ఇండస్ట్రీ కి రప్పించే ఎలివేషన్స్ సైతం ఉంటాయి. ప్రేక్షకుడి చేత విజిల్స్ వేయించడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు. అందుకోసమే తన సినిమాలకు రీచ్ ఎక్కువగా ఉంటుంది. బీ, సీ సెంటర్ లోని ఆడియన్స్ ఆయన సినిమాలను రిపీటెడ్ గా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మొత్తానికైతే రాజమౌళి లాంటి దర్శకుడి నుంచి వచ్చే ప్రతి సినిమా ఒక మంచి ఎంటర్టైనర్ అనే చెప్పాలి… ఇక రాజమౌళి తో పాటు ఇండస్ట్రీ లో ఉన్న సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు సైతం తమ సత్తాను చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక వీళ్ళందరి ఫేవరెట్ డైరెక్టర్ కూడా ఒకరే కావడం విశేషం…నిజంగా వీళ్ళందరికి సెపరేట్ గా ఇష్టమైన డైరెక్టర్లు ఉన్నప్పటికి సింగీతం శ్రీనివాసరావు అంటే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఎందుకంటే 90స్ లో ఆయన చాలా గొప్ప అద్భుతమైన సినిమాలు చేశాడు.
ఆ దర్శకుడి నుంచి వచ్చే ప్రతి సినిమా కోసం ప్రేక్షకులతో పాటు చాలామంది మేకర్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు.
ఎందుకంటే కొత్తదనాన్ని తీసుకురావడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. అందుకోసమే అతనికి చాలా మంది ఫ్యాన్స్ గా మారిపోయారు.
ఇక కొంతమంది మేకర్స్ అయితే అతని నుంచి ఆ టెక్నాలజీని వాడుకోవడం ఎలా అనేది నేర్చుకొని మరి సినిమాలను చేస్తున్నారు… ఇక ప్రస్తుతం ఆయన 94 సంవత్సరాల వయసులో కూడా సినిమాను చేయడానికి సిద్ధమయ్యాడు అంటే ఆయనకు సినిమా అంటే ఎంత పిచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక హై రేంజ్ బడ్జెట్ తో స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రస్తుతం అదే కథని సినిమాగా తీస్తున్నట్టుగా తెలుస్తుంది…