Shyam Singha Roy Teaser: ‘నాని’ ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన విలక్షణమైన పాత్రలు చేసినా.. వాటిల్లో సహజత్వం మాత్రమే ఉండేది. కానీ మొదటిసారి, నాని పోషించిన ‘శ్యామ్ సింగ రాయ్’ పాత్రలో ఒక విజృంభణ ఉంది. ఆ పాత్రకు ఒక చారిత్రక నేపథ్యం ఉంది. పైగా నాని తన కెరీర్ లోనే పూర్తి భిన్నంగా కనిపించి మెప్పించబోతున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’.

ఈ సినిమా నుంచి వచ్చిన 1 నిమిషం 40 సెకన్ల అఫీషియల్ టీజర్ లో ప్రతి ఫ్రేమ్ లో ఒక సింబాలిక్ షాట్ ఉంది. ప్రతి ఎక్స్ ప్రెషన్ లో ఒక డెప్త్ ఉంది. నాని లుక్ అండ్ సెటప్, సాయి పల్లవి అమ్మవారి గెటప్ అద్భుతంగా అనిపించాయి. ఇక టీజర్ ఫస్ట్ షాట్ నుంచి చివరి డైలాగ్ వరకు బ్యాగ్రౌండ్ స్కోర్ అల్టిమేట్ గా వర్కౌట్ అయింది.
అలాగే స్టార్టింగ్ లో వచ్చిన వాయిస్ ఓవర్.. ‘అడిగే అండ లేదు, కలబడే కండలేదు, రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే.. కాగితం కడుపు చీల్చుకుపుట్టి రాయడమే కాదు.. కాలరాయడం కూడా తెలుసు. అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే శ్యామ్ సింగ రాయ్’ అంటూ చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది.
అన్నిటికీ మించి విజువల్స్ అండ్ టేకింగ్, సినిమాలో దేవాలయం సెట్.. ఒకప్పటి కలకత్తాని చూపించిన విధానం, అలాగే అప్పటి కాలానికి చెందిన వస్త్రధారణ.. ఇలా ప్రతి అంశంలో ఈ సినిమా మేకర్స్ అబ్బురపరిచారు.
ఇక టీజర్ లో చెప్పిన ప్రధాన కంటెంట్ విషయానికి వస్తే.. ?
ఒకప్పుడు కలకత్తాలో ఆడవాళ్ళని దాసులుగా మార్చి వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకునేవారు ? అలాంటి అప్పటి నీచమైన ఆచార్య వ్యవహారాల పై ఒక జర్నలిస్ట్ (నాని) తిరగబడితే ఎలా ఉంటుంది ? చివరకు తాను ప్రేమించిన అమ్మాయే ఓ దాసిగా మారితే అతనిలో ఇక ఎలాంటి ఉగ్రరూపం బయటకు వస్తోంది ? అనే కోణంలో సాగిన ఈ సినిమా టీజర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది.
టీజర్ మెయిన్ హైలైట్స్ :
నాని డైలాగ్స్ అండ్ బాడీ లాంగ్వేజ్,
సాయి పల్లవి యాక్టింగ్ అండ్ గెటప్.
కృతి శెట్టి లిప్ కిస్ అండ్ గ్లామర్.
మిక్కీ జే మేయర్ సంగీతం,
1970 లో కలకత్తా విజువల్స్.
వెంకట్ బోయనపల్లి నిర్మాణ విలువలు.
ఇక అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే “శ్యామ్ సింగ రాయ్” అంటూ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు పై ఈ టీజర్ నమ్మకాన్ని పెంచింది. విభిన్నమైన కథాంశంతో రానున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అలాగే ముగ్గురు హీరోయిన్స్ సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి నటిస్తున్నారు.
Also Read: లేడీ సూపర్ స్టార్ నయనతార బర్త్ డే స్పెషల్!

నానికి మళ్లీ తప్పని విడుదల కష్టాలు!.. శ్యామ్ సింగరాయ్కు పోటీగా ఆ హీరోలు!