Kangana: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది. దేశం, మహిళలు ఇలా రకరకాల అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేయడమే కాకుండా.. తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా.. వారికి గట్టి రిప్లై ఇస్తుంటుంది. అందుకే ఈమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా ఉంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్‌మీడియా వేదికగా యాక్టీవ్‌గా ఉంటుంది.

తాజాగా, మరోసారి స్టాండప్ కమిడియన్ విర్ దాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది కంగనా. వెండితెరతో పాటు బుల్లితెరపైనా కమెడియన్‌గా మంచి తెచ్చుకున్నారు విర్ దాస్. ఇటీవల వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఆయన.. తాజాగా ఓ కార్యక్రమంలో ఉదయం మహిళల్ని పూజించే దేశంలో.. రాత్రి సమయంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. అంటూ వ్యాఖ్యానించారు.
— Vir Das (@thevirdas) November 16, 2021
అయితే, ఈ విషయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో పుట్టి మహిళల్ని కించపరిచేలా దాస్ మాట్లాడారంటూ విరుచుకుపడ్డారు. అయితే, ఇప్పుడు కంగనా కూడా ఈ విషయంపై స్పందించడం చర్చనీయాంశమైంది. “భారతీయ పురుషులందర్నీ గ్యాంగ్ రేపిస్టులుగా చిత్రీకరిస్తూ విర్ దాస్ మాట్లాడారంటూ.. ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని నేరస్థులుగా పరిగణించి.. చట్టబద్దంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. నోటికొచ్చినట్లు మాట్లాడిన విర్దాస్ను శిక్షించాలని.. భవిష్యత్తులో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గుణపాఠం చెప్పాలని కంగనా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలు కొంతమంది నెటిజన్లు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల పద్మశ్ర పురస్కారాన్ని అందుకున్న కంగనా.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.