Shreshti Verma and Johnny Master : గత ఏడాది శ్రేష్టి వర్మ(Sreshti Varma) అనే కొరియోగ్రాఫర్ పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము లేపుతున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) పై లైంగిక వేధింపుల కేసు ని పెట్టడం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా నెల రోజుల పాటు ఆయన అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి, మళ్ళీ తన వృత్తిలో ఫుల్ బిజీ అయ్యాడు. ఆయనకు బెయిల్ రద్దు అవ్వాలంటూ శ్రేష్టి వర్మ సుప్రీం కోర్టు వరకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ అంశం విషయం లో జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చెయ్యలేదని నమ్మే వాళ్ళు ఉన్నారు. అదే విధంగా శ్రేష్టి వర్మ పై జాలి చూపించేవాళ్ళు కూడా ఉన్నారు. ఇరు పక్షాలకు బలమైన సపోర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రేష్టి వర్మ రీసెంట్ గా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపింది.
Also Read : తనకి ఇలాంటి సన్మానం చేయడంతో కన్నీటి పర్యంతమైన జానీ మాస్టర్..వైరల్ అవుతున్న వీడియో!
ఆమె మాట్లాడుతూ ‘మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు వంటి వారు మన దేశానికి ద్రోహం చేసి, మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేసి వెళ్లిపోయారు. రాబోయే తరానికి చెందిన వాళ్ళు , ఇలాంటి దేశద్రోహుల గురించి కాకుండా, స్వాతంత్రం కోసం నిజంగా పోరాడిన వాళ్ళ గురించి తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాల్లో వీళ్ళ గురించి తెలిపే అధ్యాయాలను తొలగించాలి. ఎందుకంటే వాళ్ళు దేశానికీ చేసిన ద్రోహం అలాంటిది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో ఎలాగో భగ్గుమంటుంది. జాతిపిత మహాత్మా గాంధీ పేరు కూడా ఎత్తడానికి అర్హత లేని నువ్వు, ఆయనపై ఇన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తావా?, అసలు ఏమనుకుంటున్నావ్ నీ గురించి నువ్వు? అంటూ కామెంట్స్ సెక్షన్ లో శ్రేష్టి వర్మ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గుంటూరు జిల్లా NSUI అధ్యక్షులు షేక్ కరీమ్ శ్రేష్టి వర్మ పై కేసు పెట్టారు. స్వతంత్ర సమరయోధులను గౌరవించాల్సింది పోయి, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హేళన చేస్తుంది. హద్దులు దాటి ప్రవర్తించిన శ్రేష్టి వర్మ పై FIR నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఈ సందర్భంగా షేక్ కరీమ్ పోలీసులకు విజ్ఞప్తి చేసాడు. అయితే ఈ కేసు ని జానీ మాస్టర్ పెట్టించి ఉంటాడని సోషల్ మీడియా లో శ్రేష్టి వర్మ మద్దతుదారులు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే జానీ మాస్టర్ సామజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ కేసు నమోదు చేసాడని,కచ్చితంగా ఇది ఆయన పనే అయ్యుంటాది అని అంటున్నారు. అయితే శ్రేష్టి వర్మ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా దుమారం రేపేవే. అందుకు జానీ మాస్టర్ ప్రత్యేకంగా కేసు పెట్టించాల్సిన అవసరం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే జనాలందరూ కేసు నమోదు చేయొచ్చు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.