Johnny Master
Johnny Master : గత ఏడాది నేషనల్ లెవెల్ లో సెన్సేషనల్ టాపిక్స్ గా మారిన సెలెబ్రిటీలలో ఒకరు జానీ మాస్టర్. నేషనల్ అవార్డు రావడంతో ఆయన పేరు దేశమంతటా మారుమోగింది. అదే సమయంలో ఆయన టీంలో పని చేసే శ్రేష్టి వర్మ అనే అమ్మాయి, జానీ మాస్టర్ లైంగిక వేధింపులు చేస్తున్నాడంటూ పోలీస్ కేసు వేయడం, విచారణ కోసం రిమాండ్ లో జానీ మాస్టర్ నెల రోజులు చంచల్ గూడా జైలు లోనే ఉండడం, ఆయనకీ ప్రకటించిన నేషనల్ అవార్డుని వెనక్కి తీసుకోవడం, ఆ తర్వాత కొన్నాళ్ళకు రెగులర్ బెయిల్ మీద బయటకి రావడం వంటివి జరిగాయి. ఈ ఘటనలో మొదట్లో జానీ మాస్టర్ పై చాలా వ్యతిరేకత నెటిజెన్స్ నుండి ఉండేది కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలోకి తీసుకున్న తర్వాత జానీ మాస్టర్ పై సానుభూతి పెరగడం మొదలైంది. అంతేకాకుండా సినిమా అవకాశాలు కూడా ఇప్పుడు ఆయనకు వస్తున్నాయి.
బెయిల్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి కన్నడలో ఒక కొత్త సినిమాకి కొరియోగ్రఫీ చేసే అవకాశం దక్కింది. నేడు ఆయన షూటింగ్ లో పాల్గొనగా, మూవీ యూనిట్ జానీ మాస్టర్ కి గ్రాండ్ వెల్కమ్ పలికింది. ఆయనకు శాలువా కప్పి లోపలకు ఆహ్వానిస్తూ, అనంతరం అతనికి గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి అందించారు. ఆ తర్వాత ‘వెల్కమ్ బ్యాక్ జానీ మాస్టర్’ అని రాసిన కేక్ ని కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చివర్లో జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మూవీ టీం ఆయనపై చూపించిన ప్రేమకు బావోద్వేగారికి గురయ్యాడు. అనంతరం ఆయన సోషల్ మీడియా ద్వారా ఆ అనుభూతిని పంచుకుంటూ ఒక పోస్ట్ వేసాడు.
అందులో ఆయన మాట్లాడుతూ ‘చాలా రోజుల తర్వాత నేను బెంగళూరులోకి అడుగుపెట్టాను. యూర్స్ సిన్సియర్లీ రామ్ మూవీ కి కొరియోగ్రఫీ చేయడానికి రీసెంట్ గానే సంతకం చేశాను. ఆ మూవీ సెట్స్ లోకి నేడు అడుగుపెట్టగా మూవీ టీం నుండి ఇంతటి ఘనమైన స్వాగతం దొరుకుతుందని అనుకోలేదు. నాపై మీరు చూపించిన ఈ ప్రేమకు ధన్యవాదాలు. నన్ను ఇంతగా చేసిన మూవీ టీం లోని ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను. జీవితాంతం మీరు చూపించిన ఈ ప్రేమని మర్చిపోలేను’ అంటూ ఎమోషనల్ గా కామెంట్స్ చేసాడు. కేవలం కన్నడలోనే కాదు, తెలుగు లో కూడా జానీ మాస్టర్ కి అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోని పాటలకు కొరియోగ్రఫీ చేయనున్నాడు. జానీ మాస్టర్ కి జీవితాన్ని ఇచ్చిన హీరో రామ్ చరణ్, రీ ఎంట్రీ లో మళ్ళీ రామ్ చరణే ఆయనకు అవకాశం ఇవ్వడం గమనించాల్సిన విషయం.
Stepped into #Bangalore after a verly long time and I’m extremely overwhelmed by the warm welcome on the sets of #YoursSincerelyRaam ❤️
Extremely grateful to each and everyone from the Team for the opportunity and support@Official_Ganesh @Ramesh_aravind #VikyathAR… pic.twitter.com/AJzIZ4c1Ra
— Jani Master (@AlwaysJani) February 3, 2025
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Johnny master is moved to tears after being honored like this video goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com