Squid Game 3 : ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ సమయం లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ‘స్క్విడ్ గేమ్స్'(Squid Games 3) వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నెటిజెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది ఈ వెబ్ సిరీస్. ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు ఆడియన్స్ కి కొరియన్ వెబ్ సిరీస్లు, సినిమాలపై ఆసక్తి కలిగించేలా చేసిన వెబ్ సిరీస్ ఇది. ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి అయ్యాయి. కానీ మొదటి సీజన్ కి వచ్చినంత రెస్పాన్స్, రెండవ సీజన్ కి రాలేదు. కారణం క్లైమాక్స్ నిరాశపర్చడమే. రెండవ సీజన్ తోనే సిరీస్ ని ముగించొచ్చు. కానీ కమర్షియల్ గా ఆలోచిస్తూ మూడవ సీజన్ కి పొడిగించారు. ఇది ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. అయితే ఇప్పుడు మూడవ సీజన్ కి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్.
Also Read : ‘హిట్ 3’ కి ‘స్క్విడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ కి మధ్య ఉన్న లింక్ ఇదేనా..?
ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే రెండవ సీజన్ లో హీరో గేమ్స్ ఆడేందుకు వచ్చిన వాళ్లలో ఉత్తేజాన్ని నింపుతూ, స్క్విడ్ గేమ్ సైనికులను హతమారుస్తూ, ఈ గేమ్స్ ని నిర్వహించే బాస్ దాకా వెళ్లి దొరికిపోతాడు. తన సైనికులను హతమార్చిన హీరో ని, తిరగపడిన ప్లేయర్స్ ని బాస్ దొరికినప్పుడు లాజిక్ ప్రకారం చంపేయాలి కదా?, కానీ మళ్ళీ గేమ్స్ ఆడించడం ఏమిటి?, ఎందుకు అలా చూపిస్తున్నారు అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అయ్యాయి. ఇది కేవలం కమర్షియల్ గా సాగదీసేందుకు చేస్తున్న సీజన్ లాగానే అనిపిస్తుంది, స్టోరీ లేదు, ఈ సీజన్ కూడా రెండవ సీజన్ లాగా ఫ్లాప్ అవ్వొచ్చు అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే నెల 27 న ఈ సీజన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
మొదటి సీజన్ దాదాపుగా ఏడాదికి పైగా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూ కనిపించింది. అప్పట్లో ఈ సిరీస్ తెలుగు లో మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండేది కాదు. అయినప్పటికీ ఆ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. కానీ రెండవ సీజన్ అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కూడా పట్టు మని నెట్ ఫ్లిక్స్ లో ఆరు నెలలు కూడా ట్రెండ్ అవ్వలేదు. దీనిని బట్టి రెండవ సీజన్ ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మూడవ సీజన్ రెండవ సీజన్ చేసిన నష్టాలను పూడుస్తుందా లేదా?, లేకపోతే ఇంకా పెద్ద ఫ్లాప్ అవుతుందా అనేది చూడాలి.
Also Read : ‘స్క్విడ్ గేమ్’ 3వ సీజన్ విడుదల తేదీని ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ..వైరల్ అవుతున్న వీడియో!