ఓటీటీ లో కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈమె డేట్స్ కోసం మన తెలుగు దర్శక నిర్మాతలు తెగ ప్రయత్నం చేస్తున్నారు కానీ, ఆమె డిమాండ్ చేసే పారితోషికాన్ని ఇచ్చుకోలేక వెనకడుగు వేస్తున్నారు. ‘పుష్ప 2′(Pushpa 2 Movie) చిత్రంలోని ‘కిస్సిక్’ పాట ని ముందుగా శ్రద్దా కపూర్ తోనే చేయించాలని అనుకున్నారట. కానీ ఆమె 8 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అడగడంతో పాటు, పాటని కేవలం రెండు రోజుల్లో ఫినిష్ చేయాలని కండీషన్ పెట్టడంతో, ఆమెని పక్కన పెట్టి శ్రీలీల తో ఈ పాటని షూట్ చేసారు. ఇదంతా పక్కన పెడితే శ్రద్ద కపూర్ చాలా కాలం నుండి రాహుల్ మోడీ అనే అతనితో డేటింగ్ చేస్తుంది అంటూ బాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగింది. దీనిపై ఆమె ఇప్పటి వరకు మౌనంగానే వ్యవహరించింది.
కానీ రీసెంట్ గానే ఒక ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరైన శ్రద్దా కపూర్, అక్కడి ఫోటో గ్రాఫర్స్ కి చిక్కింది. అందులో ఆమె తన మొబైల్ వాల్ పేపర్ మీద రాహుల్ మోడీ తో కలిసి ఉన్న ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకోవడాన్ని గమనించారు ఫోటో గ్రాఫర్స్. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చర్చనీయాంశంగా మారింది. రహస్యం గా రిలేషన్ మైంటైన్ చేయాలి అనుకున్నప్పుడు, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కదమ్మా అంటూ శ్రద్దా కపూర్ పై కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇకపోతే శ్రద్ద కపూర్ స్త్రీ 2 తర్వాత బాలీవుడ్ లో మూడు సినిమాల్లో నటించడాయికి సంతకాలు చేసింది. అదే విధంగా ఈమె కోసం మన టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అన్ని పర్ఫెక్ట్ గా కుదిరితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం లో ఒక ఐటెం సాంగ్ లో ఈమె కనబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read : ‘సలార్ 2’ లో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఆ రేంజ్ లో చూపించబోతున్నాడా..?