Salaar 2 : సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ టాలెంట్ ఉన్నంత మాత్రాన సరిపోదు అంతో ఇంతో అదృష్టం కూడా ఉండాలి.అలా అయితేనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి ఎదిగే అవకాశమైతే దక్కుతుంది… లేకపోతే మాత్రం చేసిన సినిమాలు చేసినట్టుగా ఫ్లాప్ అవుతూ ఉండడం దానివల్ల ఆ హీరోలకు మార్కెట్ లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయే అవకాశాలైతే ఏర్పడవచ్చు…
యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)…ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి… ఇక బ్యాక్ టు బ్యాక్ సలార్(Salaa), కల్కి (Kalki) సినిమాలతో భారీ విజయాలను సాధించిన ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలతో వరుస విజయాలను అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ప్రస్తుతం రాజాసాబ్(raajasaab) , స్పిరిట్ (Spirit) లాంటి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు… బాహుబలి(Bahubali) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత చేసిన సినిమాలతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నాడు. ఆయన ఫ్లాప్ సినిమాలకి కూడా భారీ కలెక్షన్స్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఆయన లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం…
Also Read : సలార్ 2 మూవీలో రజినీకాంత్ నటించనున్నాడా..? ఆయన కోసం సెపరేట్ గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందా..?
ఇండియాలోనే ఆయన నెంబర్ వన్ హీరోగా మారాడు. ఇక రాబోయే సినిమాలతో వరుస విజయాలు అందుకుంటే ఇండియాలో నెంబర్ వన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా ఆయన పొజిషన్ ని టచ్ చేసే మరొక హీరో ఉండరు…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సలార్ 2 సినిమా మరొకెత్తుగా మారబోతుందట…
మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయిలో ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక సలార్ 2 సినిమాతో ప్రశాంత్ నీల్ మరోసారి ప్రభాస్ స్టార్ డమ్ ను మరోసారి భారీగా ఎలివేట్ చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారట. మరితను అనుకున్నట్టుగా ప్రభాస్ ని చూపించినట్టైతే ఆయన మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడికి మరోసారి దగ్గరవుతాడు.
తద్వారా ఆయన చేసే సినిమాలతో పాటు ఆయనకు కూడా భారీ క్రేజ్ అయితే దక్కుతుంది… సలార్ సినిమాలో కాటేరమ్మ ఫైట్ సీన్ తో పూనకాలు పెంచిన ప్రభాస్ సెకండ్ పార్ట్ లో కూడా అంతకుమించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ చేస్తాడట… ప్రశాంత్ నీల్ సైతం మొదటి పార్ట్ కి మించి సెకండ్ పార్ట్ ఉండబోతుందంటూ చాలా క్లియర్ కట్ గా తెలియజేశాడు…
Also Read : సలార్ 2 లో ప్రభాస్ ను వెన్ను పోటు పొడువనున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?