Tandel Movie Collections : వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందుకుంటున్న అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రం ‘తండేల్'(Thandel Movie). విడుదలకు ముందే ఈ సినిమా పాటల ద్వారా ఒక సునామీని సృష్టించింది. ఎక్కడికి వెళ్లినా ‘తండేల్’ చిత్రంలోనే పాటలే వినిపిస్తూ ఉండేవి. అలా పాటల ద్వారా ఎంతో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత కాస్త యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ, ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు భారీ వసూళ్లను రాబడుతూ సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ ప్రాంతం లో తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా పెట్టిన ప్రతీ పైసాకి మూడింతలు లాభాలు వచ్చాయి. ఈ నెల 7వ తారీఖున ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
Also Read : ‘తండేల్’ 15 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంత దారుణంగా కలెక్షన్స్ పడిపోతాయని ఊహించలేదు!
థియేట్రికల్ రన్ కూడా దాదాపుగా క్లోజింగ్ కి వచ్చేసినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే నిన్న ఆదివారం అయినప్పట్టికీ కేవలం 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఇక ఈరోజుటి నుండి 5 లక్షల రేంజ్ లో షేర్ వసూళ్లు వస్తాయి. అంటే క్లోజింగ్ కి మరో 20 నుండి 30 లక్షల షేర్ కలవొచ్చు. నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యాక పూర్తిగా థియేట్రికల్ రన్ ముగిసినట్టే అనుకోవాలి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి 94 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 54 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. మేకర్స్ వంద కోట్ల గ్రాస్ ని దాటేసింది పోస్టర్స్ వేశారు కానీ, ఆ రేంజ్ వసూళ్లు రియాలిటీ లో రాలేదు అనేది వాస్తవం. దీంతో అక్కినేని ఫ్యామిలీ కి వంద కోట్ల రూపాయిల కల కలగానే మిగిలిపోయింది.
కానీ ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో వచ్చి ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం కూడా చిన్న విషయం కాదు. సమ్మర్, లేదా సంక్రాంతికి విడుదల అయ్యుంటే ఈ సినిమా మరో 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అదనంగా రాబట్టి ఉండేదని అంటున్నారు. అయితే అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోయినప్పటికీ ఈ సినిమా అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో మాత్రమే కాదు, అక్కినేని ఫ్యామిలీ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిందని అంటున్నారు. సినిమాని నిర్మించడానికి 80 కోట్లు ఖర్చు అయ్యింది. థియేటర్స్ నుండి వచ్చిన డబ్బులు 54 కోట్ల షేర్, ఓటీటీ రైట్స్ 25 కోట్లకు అమ్ముడుపోయింది. అదే విధంగా సాటిలైట్ రైట్స్ , హిందీ సాటిలైట్ డబ్బింగ్ రైట్స్ వగైరా వంటివి కలిపి మరో 30 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. ఓవరాల్ గా నిర్మాత అల్లు అరవింద్ కి ఇది లాభాలను తెచ్చి పెట్టిన సినిమా.
Also Read : ఓటీటీలోకి నాగ చైతన్య ‘తండేల్’..పైరసీ పై ఓటీటీ సంస్థ మండిపాటు..తప్పనిసరి పరిస్థితిలో దిగొచ్చిన అల్లు అరవింద్!