Homeఎంటర్టైన్మెంట్అశ్లీల చిత్రాల భర్త పై శిల్పా శెట్టి స్పందన !

అశ్లీల చిత్రాల భర్త పై శిల్పా శెట్టి స్పందన !

Shilpa Shetty about Raj Kundra Arrestఅశ్లీల చిత్రాల సృష్టికర్తగా పేరుప్రఖ్యాతలు సాధించిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ కావడం, ఆ తర్వాత ఆయనగారి లీలల పై అనేక కథనాల రావడం గురించి ప్రత్యేకంగా ముచ్చటించుకునే పనే లేదు. ప్రస్తుతం అతగాడు ఇంకా ముంబై పోలీసుల కస్టడీలోనే మగ్గిపోతూ ఉన్నాడు. మరి తన ముద్దుల భర్త అరెస్ట్‌ సంగతి ఇప్పటివరకు మాట్లాడానికి కూడా ఇష్టపడలేదు శిల్పాశెట్టి.

కానీ, మీడియా టార్చర్ దెబ్బకు మొత్తానికి ఈ ముదురుభామ తొలిసారి సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది. రెగ్యులర్ గా స్పందిస్తే బాగానే ఉండేది. కానీ, ఇలా కామెంట్లు పెట్టింది. ‘కోపంలో వెనక్కి తిరిగి చూడకూడదు. భయంగా ఉన్నప్పుడు భవిష్యత్తును చూడకూడదు. పూర్తి అవగాహనతో ఉన్నప్పుడే చుట్టుపక్కల చూడాలి’ అంటూ తన పరిస్థితి గురించి అమ్మడు అర్ధవంతంగా రాసుకొచ్చింది.

అలాగే ఇంకా ఈ యోగా బ్యూటీ రాసుకొస్తూ.. ‘మనల్ని బాధపెట్టిన వారి వైపు కోపంతో వెనక్కి తిరిగి చూడటం మనకు బాగా అలవాటు. అలాగే మనకు ఎప్పుడూ మనకు బాగా ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామనే భయంతోనో భవిష్యత్తును చూస్తూ ఉంటాం’ అంటూ తన భర్త పై ఇంకా తనకు ప్రేమ చావలేదు అన్నట్టు అర్ధం వచ్చేలా ఓ మెసేజ్ పెట్టింది.

ఇక చివరగా ‘అదృష్టవశాత్తు నేను ఇంకా బతికే ఉన్నానని తెలిసి గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాను. అందరికీ తెలుసు.. గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. అదే విధంగా భవిష్యత్తులో కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటాను. ఏం జరిగినా నేను బతికే ఉంటాను. నన్ను ఏ శక్తీ ఆపలేదు’ అని శిల్పా తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. మొత్తమ్మీద శిల్పా చాల రాసుకొచ్చింది గాని, తన మొగుడు ఏ తప్పు చేయలేదని మాత్రం చెప్పట్లేదు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular