Shekhar Kammula Comments On Pawan kalyan: టాలీవుడ్ లో భిన్నమైన ఆలోచనలతో సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula). ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్,లీడర్, ఫిదా, లవ్ స్టోరీ ఇలా ఎన్నో సంచలనాత్మక చిత్రాలు తీసాడు. ప్రతీ సినిమా ఒక ప్రత్యేకమైన జానర్ లో ఉంటుంది. అయినప్పటికీ చాలా కొత్తగా, అద్భుతంగా ఉంటుంది. ఆయన స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ లో ఉన్న మ్యాజిక్ ఇదే. ‘లవ్ స్టోరీ’ చిత్రం తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని శేఖర్ కమ్ముల రేపు మన ముందుకు ‘కుబేర'(Kubera Movie) చిత్రం తో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, పాటలు ఆడియన్స్ నుండి విశేషమైన ఆదరణ దక్కించుకున్నాయి. ఇక ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపించని శేఖర్ కమ్ముల,ఈ సినిమాకు మాత్రం ప్రత్యేకమైన శ్రద్ద చూపించి అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.
అందులో ఒక ఇంటర్వ్యూ లో ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పని తీరు గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. యాంకర్ ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ గారి పని తీరు ఎలా ఉంది?’ అని అడగ్గా, దానికి శేఖర్ కమ్ముల సమాధానం చెప్తూ ‘గత మూడేళ్ళుగా సినిమా మీదనే నేను ఎక్కువగా ద్రుష్టి పెట్టాను. ఈ మూడేళ్ళ గ్యాప్ లో రాజకీయాలను పెద్దగా ఫాలో అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనిషి, ఆయనలో జనాలకు ఎదో చెయ్యాలనే తపన కచ్చితంగా ఉంది. కచ్చితంగా అద్భుతమైన పాలన ఇస్తున్నాడనే అనుకుంటాను. అయితే రాజకీయాలను అనుసరించకపోవడం వల్ల ఆయన పని తీరుని నేను గమనించలేదు. ఇప్పుడు ఖాళీ దొరికింది కాబట్టి ఒకసారి చూస్తాను మొత్తం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.
శేఖర్ కమ్ముల మొదటి నుండి పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద వీరాభిమాని. జనసేన పార్టీ పెట్టిన కొత్తల్లో శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ మొదటి ప్రసంగాన్ని చూసి ఎంతో మెచ్చుకున్నాడు. సోషల్ మీడియా లో అనేక ట్వీట్స్ కూడా వేసాడు. కానీ రెండవ ప్రసంగం లో తాను ప్రత్యక్షంగా ఈసారి పోటీ చేయడం లేదని, బీజేపీ కి మద్దతు తెలుపుతానని చెప్పడం తో, ఎవరికో మద్దతు ఇవ్వడానికి ఇంత ఆవేశం,ఉద్వేగం అనవసరం అంటూ కాస్త నిరాశ చెందుతూ ట్వీట్స్ వేసాడు. అలా అప్పట్లో శేఖర్ కమ్ముల రాజకీయాలను అనుసరించేవాడు. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయాలను పెద్దగా అనుసరించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఇకపోతే కెరీర్ లో అత్యధిక శాతం సక్సెస్ రేట్ ఉన్న శేఖర్ కమ్ముల, తన విజయవంతమైన జర్నీ ని ‘కుబేర’ తో కొనసాగిస్తాడా లేదా అనేది రేపటితో తేలనుంది.