spot_img
Homeఎంటర్టైన్మెంట్Shanmukh Jaswanth: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న షణ్ముఖ్... తీవ్ర డిప్రెషన్ కి కారణం అదేనా?

Shanmukh Jaswanth: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న షణ్ముఖ్… తీవ్ర డిప్రెషన్ కి కారణం అదేనా?

Shanmukh Jaswanth: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ కలకలం రేపింది. గంజాయి కేసులో అతను ఇరుక్కున్నాడు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ పై మౌనిక అనే యువతి కేసు పెట్టింది. ప్రేమ పేరుతో మోసం చేశాడు. తనను పెళ్లి చేసుకోకుండా వేరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ కోసం ఫ్లాట్ కి వెళ్లిన పోలీసులు అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ ఉండటం గమనించారు. ఆ ఇంట్లో గంజాయి కూడా కొంత పరిమాణంలో స్వాధీనం చేసుకున్నారు.

దీంతో షణ్ముఖ్ ని అరెస్ట్ చేశారు. అనంతరం షణ్ముఖ్ బెయిల్ పై విడుదలయ్యాడు. కాగా షణ్ముఖ్ డిప్రెషన్ లో ఉన్నట్లు విచారణ సమయంలో ఒప్పుకున్నట్లు సమాచారం. ఒత్తిడి నుండి బయటపడేందుకే గంజాయి తీసుకున్నట్లు అతడు ఒప్పుకున్నాడనే ఓ వాదన తెరపైకి వచ్చింది. కాగా షణ్ముఖ్ ఒత్తిడికి ఎందుకు లోనయ్యాడనే చర్చ మొదలైంది. షణ్ముఖ్ చాలా కష్టపడి పైకి వచ్చాడు. తన టాలెంట్ ని నమ్ముకుని షార్ట్ ఫిలిమ్స్, డాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్లు చేశాడు.

షణ్ముఖ్ చేసిన కొన్ని వెబ్ సిరీస్లు విశేష ఆదరణ పొందాయి. దాంతో పాపులర్ అయ్యాడు. షణ్ముఖ్ జస్వంత్ కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. ఆహా కోసం షణ్ముఖ్ ఒక వెబ్ సిరీస్ చేయడం విశేషం. మరి కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుండగా.. ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం ఏంటనే వాదన మొదలైంది. అయితే షణ్ముఖ్ ఓ మూడేళ్ళ క్రితం లవర్ దీప్తి సునైనతో విడిపోయాడు. 2021లో షణ్ముఖ్ బిగ్ బాస్ షోలో పాల్గొన్నాడు. సదరు షోలో సిరి హన్మంత్ తో సన్నిహితంగా మెలిగాడు.

అది నచ్చని దీప్తి సునైన బ్రేకప్ చెప్పిందనే వాదన ఉంది. దీప్తి బ్రేకప్ చెప్పినా షణ్ముఖ్ హ్యాపీగానే కనిపించాడు. సోషల్ మీడియాలో అతని పోస్ట్స్ చూస్తే ఇది అర్థం అవుతుంది. పైకి అలా కనిపించినా షణ్ముఖ్ దీప్తి కోసం ఆరాటపడ్డాడు. ఆమెను వదులుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. షణ్ముఖ్ ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నట్లు పోలీసులకు చెప్పాడట. ఈ పరిణామాలు సంచలనం రేపుతున్నాయి.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper