https://oktelugu.com/

Mahalakshmi- Ravinder: ఆ క్యూట్ సీరియల్ హీరోయిన్.. ఆ హాట్ నిర్మాతకు పెట్టిన కండీషన్ ఇదట.!

Mahalakshmi- Ravinder: సీరియల్ నటి, వీజే మహాలక్ష్మీ తమిళ నిర్మాత అయిన రవిందర్ చంద్రశేఖర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చిన వ్యవహారం గురించి తెలిసిందే. వీరి పెళ్లి జరిగిన దగ్గర నుంచి వీరి సంగతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా ఓ న్యూస్ ఛానెల్ కు మహాలక్ష్మి రవీందర్ దంపతులి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్ మాట్లాడుతూ.. పిల్లల విషయంలో తనకు మహాలక్ష్మీ ఓ కండిషన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : September 8, 2022 / 03:22 PM IST
    Follow us on

    Mahalakshmi- Ravinder: సీరియల్ నటి, వీజే మహాలక్ష్మీ తమిళ నిర్మాత అయిన రవిందర్ చంద్రశేఖర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చిన వ్యవహారం గురించి తెలిసిందే. వీరి పెళ్లి జరిగిన దగ్గర నుంచి వీరి సంగతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా ఓ న్యూస్ ఛానెల్ కు మహాలక్ష్మి రవీందర్ దంపతులి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్ మాట్లాడుతూ.. పిల్లల విషయంలో తనకు మహాలక్ష్మీ ఓ కండిషన్ పెట్టిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    Mahalakshmi- Ravinder

    ఈ కండిషన్ గురించి తెలుసుకోవాలి అంటే.. ముందు వీరి గతం గురించి తెలుసుకోవాలి. నిజానికి ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. వీళ్లిద్దరికీ గతంలోనే పెళ్లిళ్లు జరిగాయి. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాలతో వారి వారి భాగస్వామ్యులతో విడిపోయారు. ముందుగా మహాలక్ష్మి విషయానికి వస్తే ఆమెకి అనిల్‌ అనే వ్యక్తితో గతంలో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

    తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నిర్మాత రవీందర్‌ తో ఆమె ప్రేమలో పడింది. రవీందర్ కూడా తన భాగస్వామితో విడిపోయాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి తిరుపతి వేదికైంది. నెట్టింట్లో వీరి పెళ్లి ఫోటోలు ట్రెండ్ అయ్యాయి.

    Mahalakshmi- Ravinder

    ఇక మహాలక్ష్మీ రవీందర్ కి పెట్టిన కండిషన్ విషయానికి వస్తే.. తనకు కొడుకు ఉన్నాడు అని, అలానే వదిలేయకుండా తనకు మరో సంతానం కావాలని… మహాలక్ష్మీ రవీందర్‌కు కండిషన్ పెట్టిందట. ఇదే విషయాన్ని అతగాడు సిగ్గుపడుతూ చెప్పాడు. ఈయన గారు అందుకు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని రవీందర్‌కి మహాలక్ష్మి చెప్పిందట. ఇక రవీందర్ కూడా ఆమె షరతుకు అంగీకరించాడట. మొత్తానికి ఈ విషయాన్ని రవీందర్‌ సిగ్గుపడుతూ చెప్పాడు.

    Tags