Director Shankar: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా తన కెరియర్ ని మొదలుపెట్టిన శంకర్ తక్కువ సమయం లోనే ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు. ఇక ఒకప్పుడు ఈయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ మధ్యలో వచ్చిన కొన్ని ప్లాప్ ల వల్ల కొద్ది వరకు డౌన్ అయ్యాడనే చెప్పాలి.
ఇక ఇప్పుడు మరోసారి భారతీయుడు 2, గేమ్ చేంజర్ సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు కూడా విజువల్స్ వండర్ గా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే శంకర్ రెండు సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత ఆయన మరోసారి టాలీవుడ్ హీరో పైనే తన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.
Also Read: Vikram Thangalaan: విక్రమ్ తంగాలన్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది…
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ కూడా రీసెంట్ గా అట్లీతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయింది. ‘పుష్ప 3’ సినిమా కూడా ఉండడం లేదు. కాబట్టి శంకర్ తో సినిమా చేస్తే అది ఆయన కెరియర్ కి చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయని కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. శంకర్ ఇప్పటికే అతనికి ఒక కథ కూడా వినిపించాడట.
Also Read: Ester Noronha: మగాళ్ల కే కాదు ఆడవాళ్లకు కోరికలుంటాయి.. ఎస్తేర్ హాట్ కామెంట్స్
ఇక ఆ కథకు ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేసే దాకా బయట ఎక్కడ కూడా తెలియకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ సినిమా అప్డేట్ ని రహస్యంగా ఉంచుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అఫిషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు అనేదాని పైన క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమాని వచ్చే సంవత్సరం సెట్స్ మీదకు తీసుకెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి…