Paradise movie postponed reasons: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా చేస్తున్న ప్యారడైజ్ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొదట ఈ సినిమా మార్చి 26వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టుగా మొదట అనౌన్స్ చేసినప్పటికి ఈ సినిమాని ఆగస్టు 21వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. కారణం ఏంటి అంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వర్క్ గాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి గాని ఇంకా చాలా సమయం తీసుకోనున్న నేపథ్యంలో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయడం ఉత్తమమని భావించి ఈ సినిమాను ఆగస్టు 21 వ తేదీకి తీసుకెళ్లారు. ఇక ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయడం వల్ల చాలా సినిమాలకు ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘పెద్ది’ సినిమాకి సైతం పెద్దగా అంచనాలు లేవు కానీ ప్యారడైజ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ఆయా షేర్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది.దాంతో పాటుగా ఈ సినిమా మొత్తానికి ఈ సాంగ్ హైలైట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…
Also Read: #RRR తర్వాత ఆ వెర్షన్ లో విడుదల కాబోతున్న’పెద్ది’..సరైన ప్లానింగ్ తో వస్తే ‘వారణాసి’ కి కూడా కష్టమే!
ప్రస్తుతం పెద్ది సినిమాను రిలీజ్ చేయడానికి ఏప్రిల్ 30 వ తేదీన డేట్ ఇచ్చారు. ప్యారడైజ్ సినిమాని ఏప్రిల్ నెలలో ఎప్పుడు రిలీజ్ చేసిన కూడా పెద్ది సినిమా మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ప్యారడైజ్ సినిమాని పోస్ట్ పోన్ చేయడం పెద్ది సినిమాకి కొంతవరకు ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం నాని మాస్ ఇమేజ్ మకాం ప్రయత్నం చేస్తున్న విషయం మనకు తెలిసిందే…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రానటువంటి గుర్తింపు నాని కి దసర సినిమాతో వచ్చింది. ఆ మూవీతో మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో మరో మెట్టు పైకి ఎక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా ప్రేక్షకులను ఎలా మెప్పించబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…