https://oktelugu.com/

Vikram Thangalaan: విక్రమ్ తంగాలన్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది…

Vikram Thangalaan: ఎందుకు విక్రమ్ ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక కమర్షియల్ సినిమాలు చేసి మంచి విజయాలను సాధించొచ్చు కదా అని చెప్పే అభిమానులు కూడా ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 19, 2024 / 05:07 PM IST

    Chiyaan Vikram Thangalaan Release Date Confirmed

    Follow us on

    Vikram Thangalaan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ప్రయోగత్మకమైన సినిమాలు చేయడంలో ఎప్పుడు ముందు వరుస లో ఉండే విక్రమ్ సక్సెస్ లా పరంగా మాత్రం చాలా వెనుకబడి ఉన్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా వైవిద్యభరితమైన కథాంశాలతో తెరకెక్కినప్పటికీ సక్సెస్ మాత్రం సాధించడంలో ఆయన ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇక అయినప్పటికీ ఆయన ఇప్పటికి కూడా ఎక్స్పరిమెంటల్ సినిమాలని వరుసగా చేస్తూనే వస్తున్నాడు.

    మరి ఇలాంటి క్రమంలో ఎందుకు విక్రమ్ ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక కమర్షియల్ సినిమాలు చేసి మంచి విజయాలను సాధించొచ్చు కదా అని చెప్పే అభిమానులు కూడా ఉన్నారు. అయినప్పటికీ విక్రమ్ మాత్రం తన ధోరణిని ఎక్కడ మార్చుకోకుండా సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తు వస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో ఆయన తంగలన్ అనే సినిమా చేశాడు.

    Also Read: Ester Noronha: మగాళ్ల కే కాదు ఆడవాళ్లకు కోరికలుంటాయి.. ఎస్తేర్ హాట్ కామెంట్స్

    అయితే ఈ సినిమా నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇక అందులో ముఖ్యంగా విక్రమ్ క్లోజప్ లుక్ లో ఉన్న ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఒక దాంతోపాటుగా ఈ సినిమాను డిసెంబర్ 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నాం అంటూ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.

    Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమాకు సిద్ధం అంటున్న కన్నడ స్టార్ డైరెక్టర్…

    ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద ఇండియా వైడ్ గా భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని విక్రమ్ చూస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం కూడా ఆయన చాలా కష్టపడ్డాడనే విషయం మనకు ఆ సినిమా ట్రైలర్ ను చూస్తేనే ఈజీగా అర్థమైపోతుంది… కాబట్టి ఈ సినిమాతో ఆయన ఒక భారీ సక్సెస్ సాధించాలని కోరుకుందాం…