Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu trouble Krishna: మహేష్ బాబు చేసిన ఆ ఒక్క పనికి కృష్ణ చాలా...

Mahesh Babu trouble Krishna: మహేష్ బాబు చేసిన ఆ ఒక్క పనికి కృష్ణ చాలా రోజులు ఇబ్బంది పడ్డాడా..?

Mahesh Babu trouble Krishna: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే ఒక్కడు, అతడు, పోకిరి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించిన ఆయన టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచాడు. పాన్ ఇండియాలో తనను మించిన నటుడు మరొకరు లేరనెంతల పేరు తెచ్చుకున్నాడు. నిజానికి మహేష్ బాబు కొన్ని సినిమాల్లో అద్భుతంగా నటించాడు. అతని ఎక్స్ప్రెషన్స్ గాని యాక్టింగ్ లో ఉన్న పొటెన్షియాలిటీ గాని మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో క్లైమాక్స్ సీన్స్ లో ఆయన నటించిన తీరు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది…అలాంటి మహేష్ బాబు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో సైతం చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు… ప్రస్తుతం రాజమౌళితో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు… మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లో ఒక తప్పు పని చేశారట.

అవేంటంటే ఆయన దగ్గరికి వచ్చిన ఒక రెండు సూపర్ హిట్ సినిమాలను ఆయన రిజెక్ట్ చేశాడట. అందువల్లే కృష్ణ ఆ తర్వాత రోజుల్లో చాలా వరకు బాధపడినట్టుగా వార్తలైతే వచ్చాయి… ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ చేసిన ‘మనసంతా నువ్వే’ సినిమా కథని మొదట మహేష్ బాబు తోనే చేయాలనుకున్నారు.

Also Read: ప్యారడైజ్ పోస్ట్ పోన్ చేయడం వల్ల ఎవరికీ లాభం…

కానీ మహేష్ బాబు మాత్రం ఆ కథ తనకు సెట్ అవ్వదని చెప్పాడు. కృష్ణ సైతం ఆ స్టోరీ నీకు బాగుంటందని ఎంత చెప్పిన కూడా వినకుండా మహేష్ బాబు ఆ కథను రిజెక్ట్ చేయడంతో కృష్ణ కొంతవరకు బాధపడ్డారట. మొత్తానికైతే మహేష్ బాబు కృష్ణ చెప్పిన ఆ ఒక్క పని చేకపోవడంతో కృష్ణ కొద్ది రోజులపాటు ఆ డిప్రెషన్ లో ఉన్నాడని కూడా చాలామంది చెబుతూ ఉంటారు…

ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వే నువ్వే’ సినిమాని సైతం మొదట మహేష్ బాబుతో చేయాలనుకున్నాడట..కానీ అది చాలా సాఫ్ట్ గా ఉండడంతో మహేష్ బాబు ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు. కృష్ణ ఓకే అనుకున్నప్పటికి మొదట్లో మాత్రం మహేష్ బాబు చేస్తే బాగుంటుందనుకున్నాడట. కానీ మహేష్ బాబు ఇమేజ్ కి అది సరిపోదని తన సన్నిహితులు సైతం చెప్పడంతో ఆయన కొంతవరకు మహేష్ బాబు నిర్ణయంతో ఏకీభవించారట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version