Ram Charan: శంకర్ నుంచి రామ్ చరణ్ కి ఊరట లభించేది అప్పుడేనా..?

Ram Charan: శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

Written By: Gopi, Updated On : June 19, 2024 7:04 pm
Follow us on

Ram Charan: మెగా పవర్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న రామ్ చరణ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ కి ముందే శంకర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ గత మూడు సంవత్సరాలుగా అదే సినిమాలో బందీ అయి ఉంటున్నాడు. అయినప్పటికీ ఆ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనేది మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం లేదు.

అయితే శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిజానికైతే రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరో దొరికినప్పుడు తొందరగా సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే ఆ ప్రొడ్యూసర్ కి విపరీతమైన లాభాలు వస్తాయి. అలాగే సినిమా కూడా ఆ హైప్ ఉన్నప్పుడే భారీ కలెక్షన్లు రాబడుతుంది. కానీ శంకర్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు.

Also Read: Vikram Thangalaan: విక్రమ్ తంగాలన్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది…

త్రిబుల్ ఆర్ సినిమా చేసుకుంటూనే మరోపక్క శంకర్ సినిమాలో పాల్గొన్న రామ్ చరణ్ మూడు సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం లేదు. ఇక భారతీయుడు 2 సినిమా రిలీజ్ తర్వాతే పూర్తి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ అన్ని వస్తాయని ఇక గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ అయిన తర్వాత రామ్ చరణ్ అభిమానులు తప్పకుండా మనల్ని కంగ్రాచ్యులేట్ చేస్తారని శంకర్ తన యూనిట్ తో చెబుతున్నాడట.

Also Read: Ester Noronha: మగాళ్ల కే కాదు ఆడవాళ్లకు కోరికలుంటాయి.. ఎస్తేర్ హాట్ కామెంట్స్

ఇక డిలే అయిన దాని గురించి వాళ్ళు అసలు ఆలోచించారని సినిమాను చూసిన తర్వాత రామ్ చరణ్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించాడానికే ఇన్ని రోజులు మనం టైమ్ తీసుకున్నామని వాళ్ళు అర్ధం చేసుకుంటారని శంకర్ తన టీం తో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడట. చూడాలి మరి శంకర్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటే గేమ్ చేంజర్ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో…