Homeఎంటర్టైన్మెంట్Kalki Movie: సర్ప్రైజ్... 18 ఏళ్ల తర్వాత ప్రభాస్ కల్కి కోసం రంగంలోకి దిగిన సీనియర్...

Kalki Movie: సర్ప్రైజ్… 18 ఏళ్ల తర్వాత ప్రభాస్ కల్కి కోసం రంగంలోకి దిగిన సీనియర్ హీరోయిన్

Kalki Movie: కల్కి 2829 AD విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని పరిచయం చేశారు. మరియం అనే ఆ పాత్ర చేస్తున్న నటి ఏకంగా 18 ఏళ్ల తర్వాత టాలీవుడ్ మూవీ చేస్తుంది. లేటెస్ట్ అప్డేట్ గూస్ బంప్స్ రేపుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ అతిపెద్ద విజువల్ వండర్ గా తీర్చిదిద్దాడు. కల్కి ట్రైలర్ గూస్ బంప్స్ రేపింది. కల్కి కథను రాయడానికి 5 ఏళ్ళు పట్టిందని నాగ్ అశ్విన్ చెప్పాడు. విష్ణుమూర్తి దశావతారాల్లో కల్కి చివరిది. మనం చదివిన అన్ని పురాణాలకు కల్కి ఒక క్లైమాక్స్ వంటిది అన్నాడు.

ఇది యూనివర్సల్ కథ. అందరికీ కనెక్ట్ అవుతుందని అన్నాడు. కల్కి మూవీలో ఆసక్తి రేపే అంశం క్యాస్టింగ్. ఈ మధ్య కాలంలో ఇంత భారీ క్యాస్టింగ్ మరొక చిత్రంలో లేదు. పొన్నియిన్ సెల్వన్ లో కూడా టైర్ టు హీరోలు,హీరోయిన్స్ మాత్రమే నటించారు. కల్కిలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ దీపికా పదుకొనె ఉన్నారు. అలాగే దిశా పటాని సైతం బాగానే ఛార్జ్ చేస్తుంది.

Also Read: Director Shankar: టాలీవుడ్ స్టార్ హీరో తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న శంకర్…

ఇండియా వైడ్ మార్కెట్ ఉన్న కమల్ హాసన్, అమితాబ్ వంటి స్టార్స్ భాగమయ్యారు. రెమ్యునరేషన్ రూపంలోనే కల్కి నిర్మాతలు వందల కోట్లకు ఖర్చు చేశారు. కాగా కల్కి క్యాస్టింగ్ లో మరొక క్రేజీ యాక్ట్రెస్ జాయిన్ అయ్యారు. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ శోభన. శోభన 90లలో స్టార్ హీరోయిన్ గా వెలిగారు. పలు భాషల్లో చిత్రాలు చేశారు. శోభన తెలుగులో నటించి 18 ఏళ్ళు అవుతుంది.

Also Read: Ram Charan: శంకర్ నుంచి రామ్ చరణ్ కి ఊరట లభించేది అప్పుడేనా..?

మంచు విష్ణు-మోహన్ బాబు నటించిన గేమ్ మూవీలో ఆమె నటించారు. 2006లో విడుదలైన గేమ్ లో శోభన మోహన్ బాబు భార్య పాత్ర చేశారు. మళ్ళీ ఇన్నేళ్లకు కల్కి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆమె లుక్ సైతం ఆసక్తి రేపుతోంది. ఆమె పేరు మరియం అని తెలుస్తుంది. ఆమె ఫస్ట్ లుక్ కి ”ఆమె వలె పూర్వీకులు కూడా ఎదురుచూస్తున్నారు’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా నేడు ముంబై వేదికగా కల్కి 2829 AD ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుంది. కల్కి జూన్ 27న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే…

Exit mobile version