Ester Noronha: మగాళ్ల కే కాదు ఆడవాళ్లకు కోరికలుంటాయి.. ఎస్తేర్ హాట్ కామెంట్స్

సింగర్ నోయల్ ను ఈ అమ్మడు ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ ఆ వివాహం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇద్దరి మద్య గొడవల వల్ల ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎస్తేర్ నోరోన్హా సింగిల్ గానే ఉంటుంది.

Written By: Swathi, Updated On : June 19, 2024 4:46 pm

Ester Noronha

Follow us on

Ester Noronha: ఎస్తేర్ నోరోన్హా ఇదేంటి కొత్తగా ఉంది పేరు. అనుకుంటున్నారా? పేరు కొత్తగా ఉన్న ఫోటో చూస్తే మాత్రి ఇట్టే గుర్తు పడ్తారు. సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్ గుర్తుందా? ఆమనే ఎస్తేర్ నోరోన్హా. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసి మెప్పించింది. ఈ చిన్నది వేయి అబద్ధాలు సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. ఈ సినిమా తర్వాత సునీల్ తో సినిమా చేసింది. ఈ సినిమా కూడా మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది.

బబ్లీ గా ఉండే ఈ బ్యూటీ తన నటన, అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది ఎస్తేర్. అయితే ఈమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో హీరోయిన్ గా ఛాన్స్ లు పెద్దగా రావడం లేదు. దాంతో ఫెడ్ అవుట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇంతలోనే సింగర్ నోయల్ ను పెళ్లి చేసుకొని అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చేసింది.

సింగర్ నోయల్ ను ఈ అమ్మడు ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ ఆ వివాహం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇద్దరి మద్య గొడవల వల్ల ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎస్తేర్ నోరోన్హా సింగిల్ గానే ఉంటుంది. నోయెల్‌తో విడిపోయిన తర్వాత ఈ బ్యూటీ చిన్న చిన్న సినిమాలు చేస్తూ అభిమానులకు దగ్గర అవుతుంది. అలాగే అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తుంది. దీంతో రొమాంటిక్స్ సీన్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. 69 సంస్కార్ కాలనీ, రెక్కీ వంటి సినిమాల్లో రొమాంటిక్స్ సీన్స్ లో ఈ బ్యూటీ రెచ్చిపోయిందనే చెప్పాలి. ఈ చిన్నదాని అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ప్రస్తుతం హీరోయింగ్ గా ఓ వైపు నటిస్తూనే ఇప్పుడు దర్శకురాలిగా నిర్మాతగా కూడా మారింది. ది వేకెంట్ హౌస్ అనే సినిమాను రూపొందిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే పలు ఇంటర్వ్యూల్లో ఎస్తేర్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని అడిగితే.. ఒంటరిగా ఉండాలని లేదని.. అందుకే పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. మగాళ్లు మాత్రమే అడగటం కాదు. ఆడవాళ్లు కూడా ఆఫర్ చేస్తుంటారు అని తెలిపింది ఎస్తేర్.

అవకాశాల కోసం క్యారెక్టర్ మార్చుకోనని.. అందువల్లే తనకు చాలా సినిమాలు మిస్ అవుతున్నాయని పేర్కొంది. మోడ్రన్ డ్రస్సులు వేసుకుంటే ట్రోల్ చేస్తుంటారు. అంతే కాదు వేశ్య అని ముద్రవేస్తుంటారని ఫైర్ అయ్యింది. ఆడవాళ్లకు కోరికలు ఉండకూడదా.? అదేదో పెద్ద నేరం లా చేస్తున్నారు. ఆడాళ్లకు ఓ జీవితం ఉంటుంది. వారికి ఎమోషన్స్ ఉంటాయి అంటూ మండిపడింది ఈ బ్యూటీ.