Shalini Pandey : కేవలం ఓకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయి, ఆ తర్వాత సరైన అవకాశాలు లేక కనుమరుగు అయిపోయిన హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ‘అర్జున్ రెడ్డి'(Arjun Reddy) హీరోయిన్ షాలిని పాండే. సందీప్ వంగ(Sandeep Vanga), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో షాలిని పాండే(Shalini Pandey) ఎంత అద్భుతంగా నటించిందో మనమంతా చూసాము. హీరో విజయ్ దేవరకొండ తో పోటీ పడి మరీ ఆమె నటించింది. అంత యాక్టింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ ఈ హీరోయిన్ ఎందుకు కనుమరుగు అయిపోయింది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అర్జున్ రెడ్డి తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది కానీ, అవి ఆమెకి పెద్దగా గుర్తింపుని తీసుకొని రాలేదు. మెయిన్ హీరోయిన్ రోల్స్ కి దూరమై సైడ్ హీరోయిన్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ చేసుకునే స్థాయికి పడిపోయింది.
Also Read : అడ్రస్ లేని అర్జున్ రెడ్డి భామ…? కెరీర్ మళ్లీ పుంజుకోనుందా?
ఒక హిట్ తర్వాత ఏ హీరోయిన్ గ్రాఫ్ అయినా పెరగాలి కానీ, ఈమె గ్రాఫ్ ఏమిటి ఇలా పడిపోయింది అనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు చూస్తే ఎందుకు ఈమె అనుకున్న రేంజ్ లో సక్సెస్ చూడలేదు అనేది అర్థం అవుతుంది. ఆమె మాట్లాడుతూ ‘అర్జున్ రెడ్డి తర్వాత నాకు అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేను నటించే సన్నివేశాల్లో, డైరెక్టర్స్ కి నా క్యారక్టర్ ఎలా ఉండాలో కొన్ని ఇన్ పుట్స్ చెప్పేదానిని. కానీ ఒక్కరు కూడా వాటిని తీసుకునే వారు కాదు. ఒకసారి అయితే డైరెక్టర్ నువ్వు మేము చెప్పింది చేస్తే చాలు, మాకు ఎలా తీయాలో సలహాలు ఇవ్వనక్కర్లేదు అని అన్నాడు. నేను కేవలం క్యూట్ మరియు బబ్లీ రోల్స్ కి మాత్రమే పనికొస్తానని డైరెక్టర్స్ అనుకుంటున్నారు, నేను అనేక రకాల పాత్రలు చేయగలను, నన్ను సరిగా వినియోగించుకోవడం లేదు అనేదే నా బాధ’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇలా కెరీర్ ప్రారంభం లోనే డైరెక్టర్స్ కి సలహాలు ఇచ్చేలా ఇండస్ట్రీ లో ఈమె పైకి ఎదుగుతుందని ఎలా అనుకుందో అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రేంజ్ ఉన్న హీరోయిన్స్ కూడా డైరెక్టర్ ఏది చెప్తే అది చేసుకుంటూ పోతుంటారు, రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి ఇబ్బంది గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు డైరెక్టర్స్ చెప్పినట్టు చేయలేరు. అంతే కానీ డైరెక్టర్ మాట ని కాదని వాళ్ళు నటించడం, వాళ్లకి దర్శకత్వం నేర్పించడం వంటివి చేయరు. ఈమె కేవలం ఒక్క సినిమా హిట్ తోనే అలా ప్రవర్తిస్తే ఈమెకు అవకాశాలు ఎందుకు ఇస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : అర్జున్ రెడ్డి భామ హాట్ లుక్స్.. సోషల్ మీడియాలో వైరల్