Shalini Pandey: అర్జున్ రెడ్డి భామ హాట్ లుక్స్.. సోషల్ మీడియాలో వైరల్

తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ బ్యాక్ బ్మూటీ. అందం, అమాయకత్వం కలబోసినట్లుగా కనిపించే ఈ బ్యూటీ తెలుగులో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Written By: Swathi, Updated On : June 25, 2024 10:44 am

Shalini Pandey

Follow us on

Shalini Pandey: కొన్ని రోజుల నుంచి హీరోయిన్ లు,సెలబ్రెటీలు ఫోటోలతో తెగ సందడి చేస్తున్నారు. హీరోయిన్స్ చేసే ఆ ఫోటోలను చూసి యూత్ తెగ ముచ్చటపడుతున్నారు. వరుస ఫోటోషూట్లతో నెట్టింట సందడి చేస్తున్నారు హీరోయిన్ లు. అయితే కాస్త ట్రెండ్ మార్చి ఫేస్ ను హైడ్ చేస్తూ గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఎవరో గుర్తు పట్టండి అంటూ ఛాలెంజ్ లు కూడా విసురుతున్నారు. ఇప్పుడు పైన కనిపిస్తున్న ఫోటో కూడా ఇలాంటిది. వయ్యారాలతో అద్దానికే చెమలు పట్టిస్తోన్న ఈ బ్యూటీని గుర్తు పట్టే ఉంటారు?

తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ బ్యాక్ బ్మూటీ. అందం, అమాయకత్వం కలబోసినట్లుగా కనిపించే ఈ బ్యూటీ తెలుగులో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ క్రేజ్ ను కొనసాగించలేకపోయింది. అందం, టాలెంట్ ఎంత ఉన్న పెద్దగా కలిసి రాలేదు. తెలుగులో కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోయడంలో తగ్గడం లేదు. ఈ హీరోయిన్ ఎవరో కాదు అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే.

విజయ్ దేవర కొండకు హిట్ ను సంపాదించి పెట్టిన సినిమా అర్జున్ రెడ్డి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. హీరోగా విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టింది. ఈ సినిమాతోనే రౌడీ హీరోగా అభిమానులకు దగ్గరయ్యాడు. ఇదే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది షాలిని పాండే. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని.. అందం, అభినయంతోపాటు అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన నటనటో అభిమానులను ఫిదా చేసింది షాలిని.

అర్జున్ రెడ్డి తర్వాత మహానటి సినిమాలో కీలకపాత్ర పోషించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో మెరిసినా పెద్దగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు కూడా రాలేదు. ఇప్పుడు హిందీలో ఆఫర్స్ అందుకుంటుంది బ్యూటీ. అమీర్ ఖాన్ తనయుడు నటించిన మహారాజ్ సినిమాలో మెరిసింది. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫుట్ లో నెట్టింట హీటెక్కిక్కించేస్తుంది బ్యాక్ బ్యూటీ.

Tags