Shalini Pandey: ఎప్పుడు ఎంట్రీ ఇచ్చామన్నది కాదు ఎంట్రీ గట్టిగా పడిందా లేదా అన్నదే పాయింట్ బ్రదర్. ఈ డైలాగ్ తూ. చ తప్పకుండా గా విజయ్ దేవరకొండకు సూట్ అవుతుంది. ఎంట్రీ ముందే ఇచ్చినా ఒక్క హీరో పాత్రతో సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెండ్ హీరోగా ముద్ర వేసుకున్నాడు విజయ్. యూత్ స్టార్ గా మారాడు కూడా. అయితే కొన్ని సినిమాలు కొంత మందికి స్టార్ డమ్ ను తెచ్చిపెడితే.. మరికొంతమందికి కెరీర్ నే లేకుండా చేస్తాయి. అసలు ఒక విషయం గమనించారా? అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ క్రేజ్ మారిపోయింది. మరీ ఆ సినిమాలో భామ వార్తలు ఎక్కడ కనిపించడం లేదు వినిపించడం లేదు. ఎందుకంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? యస్ ఇప్పుడు అదే విషయం గురించి తెలుసుకుందాం…
టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ హీరోయిన్ షాలిని పాండే మాత్రం తన కేరీర్ ను సక్సెస్ పుల్ గా కొనసాగించలేకపోయింది. అర్జున్ రెడ్డి సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్నా.. కథానాయికకు మాత్రం అంతగా కలిసిరాలేదు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత నందమూరి కల్యాణ్ రామ్, రాజ్ తరుణ్ వంటి యువ హీరోలతో నటించినా అంత పేరు మాత్రం రాలేదని తెలుస్తోంది. బయోపిక్ సినిమాలైనా మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలోనూ చిన్న చిన్న పాత్రలో నటించింది. కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. కొంత మంది హీరోయిన్ లు ఒక్క సినిమా హిట్ అయితే చేతిలో అరడజనుకు పైగా సినిమాలతో బిజీ అయిపోయి రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేస్తుంటారు. కానీ ఎందుకో ఈ విషయంలో షాలినీ వెనకపడినట్టే కనిపిస్తుంది.
కథల ఎంపికలో సైతం షాలిని పాండే అనేక పొరపాట్లు చేసి పరాజయాలను మూట గట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాల్లో చాన్స్ లు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తుంది షాలిని పాండే. ఈ క్రమంలోనే ఇటీవల బాడీ మేకోవర్ చేసుకుని అద్భుతంగా ఫోటో షూట్స్ చేస్తూ పిక్స్ షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ తన లక్ ను టెస్ట్ చేసుకుంది ఈ అమ్మడు. మహానటి, 100 పర్సంట్ కాదల్, సైలెన్స్ వంటి సినిమాలలో కీలక పాత్రలు పోషించింది. అటు హిందీలో కూడా అమ్మడు తన టాలెంట్ చూపించిన వర్క్ అవుట్ కాలేదట. బాలీవుడ్ లో రణవీర్ సింగ్ కు జోడీగా జయసీయ్ భాయ్ జోర్ధార్ అనే సినిమాలో నటించింది. `మేరి నిమ్ము అనే చిత్రంలో అతిధిపాత్రలో కనిపించింది. ఆ తర్వాత బాంఫడ్ మహారాజా వంటి సినిమాలలో తన లక్ ను పరీక్షించుకున్నారు. అయితే ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ భామకు అవకాశాలు లేవని తెలుస్తోంది.
చిన్న గుడ్ న్యూస్: మొత్తం మీద అభిమానులు బాధ పడకుండా ఎట్టకేలకు ఈ అమ్మడికి ఓ సినిమా ఛాన్స్ వచ్చిందట. తాజాగా షాలిని పాండే కోలీవుడ్ హీరో ధనుష్‌తో రొమాన్స్ చేయబోతోందని సమాచారం. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న తమిళ మూవీ ఇడ్లీ కడై అనే సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యిందట. మరి ఈ సినిమా అయినా అమ్మడి అదృష్టాన్ని మారుస్తుందేమో చూడలి.