Shah Rukh Khan: సందీప్ వంగ ను ఇంటికి పిలిచిన షారుఖ్ ఖాన్…కారణం ఏంటంటే..?

అక్కడ కూడా 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి షాహిద్ కపూర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించాడు. ఇక ఆ తర్వాత 'రన్బీర్ కపూర్' ని హీరోగా పెట్టి చేసిన అనిమల్ సినిమాతో 900 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి తనని తాను నిరూపించుకున్నాడు.

Written By: Gopi, Updated On : April 15, 2024 2:42 pm

Shah Rukh Khan to team up with Sandeep Reddy Vanga

Follow us on

Shah Rukh Khan: సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ సక్సెస్ లు ఉన్న వాళ్ళకే ఇక్కడ ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడంలో చాలా వరకు సక్సెస్ అవుతాయి. కాబట్టి వారి సినిమాలు చూడడానికి ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో బాలీవుడ్ లో ఇదే సినిమాని కభీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు.

ఇక అక్కడ కూడా 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి షాహిద్ కపూర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించాడు. ఇక ఆ తర్వాత ‘రన్బీర్ కపూర్’ ని హీరోగా పెట్టి చేసిన అనిమల్ సినిమాతో 900 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి తనని తాను చాలా స్ట్రాంగ్ గా నిరూపించుకున్నాడు. ఇక దీంతో ఇప్పుడు బాలీవుడ్ హీరోలు అంతా సందీప్ రెడ్డి వంగ తో సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ తను మాత్రం సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్ కూడా సందీప్ రెడ్డి వంగ ను ఇంటికి పిలిపించుకొని మరి తనతో ఒక సినిమా చేయాలని కోరినట్టుగా సమాచారం అయితే అందుతుంది. కానీ ప్రస్తుతం సందీప్ ప్రభాస్, అల్లుఅర్జున్ లతో సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. కాబట్టి ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత షారుక్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల నుంచి టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం షారుక్ ఖాన్ కెరియర్ పరంగా కొంతవరకు డల్ అయ్యాడు.

జవాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ దాంతో భారీ సక్సెస్ అయితే అందుకోలేకపోయాడు. దానివల్ల ఇప్పుడు సందీప్ రెడ్డిని నమ్ముకుంటే 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ఈజీగా సాధించవచ్చు అనే ఉద్దేశ్యం తోనే ఆయనతో సినిమా చేయడానికి ఫిక్స్ అవుతున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి సందీప్ షారుఖ్ తో సినిమా ఎప్పుడు చేస్తాడు అనేది…