Rajamouli: కొంతమంది దర్శకులు చాలా ఎక్కువ సినిమాలు చేస్తూ అందులో కొన్ని సినిమాలతో మాత్రమే సక్సెస్ లను అందుకుంటారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం చేసినవి కొన్ని సినిమాలైనా వాటిలో ఎక్కువగా సక్సెస్ సినిమాలే ఉండేలా చూసుకుంటూ అంటారు. అలాంటి వాళ్ళలో రాజమౌళి ఒకరు. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ, ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటారు.
అందువల్ల ఆయనకి ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు తో చేసే సినిమాతో డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ సినిమాతో ఆస్కార్ అవార్డు కూడా అందుకోవాలనే ఉద్దేశ్యం తో తను అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో తను ఎంతవరకు తన డ్రీమ్ ను అచీవ్ అవుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరోసారి స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో రాజమౌళి అంటే ఏంటో ప్రపంచం మొత్తానికి తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఆయన మీద బాధ్యత చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి.
ఇక దాన్ని రీచ్ అయ్యేవిధంగా మహేష్ బాబు తో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో ఎలాంటి తప్పులు లేకుండా ముందుకు కదులుతున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికీ ఎప్పుడో సెట్స్ మీదికి వెళ్లాల్సింది కానీ రాజమౌళి చేసిన ఒక్క తప్పు వల్ల ఈ సినిమా అనేది లేట్ అవుతూ వస్తుందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. అది ఏంటి అంటే విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ రాసిన తర్వాత దానికి అనుబంధంగా మరికొన్ని ప్లాట్ పాయింట్స్ వేస్తూ ఇంకొక రెండు వర్షన్స్ ను రాయించాడట. ఇక అవి పూర్తయిన తర్వాత మళ్లీ మొదటి వర్షన్ నే తన సినిమా కోసం ఎంచుకున్నాడట. అందుకోసం చాలా టైం వేస్ట్ చేయడం.
అలాగే మళ్లీ మొదటి వర్షన్ ను సినిమాగా తీసుకుందామని చెప్పడం వల్ల దానికోసమే దాదాపుగా సంవత్సర కాలం వేస్ట్ అయిందంటూ రాజమౌళి సన్నిహితుల ద్వారా ఈ విషయమైతే బయటకు వచ్చింది.ఇక ప్రస్తుతం దానివల్లే రాజమౌళి మహేష్ బాబు సినిమా లేటవుతుంది అంటూ సోషల్ మీడియాలో దీనిమీద విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు…