Bharat Ane Nenu: భరత్ అనే నేను సినిమాలో ఇంత పెద్ద పొరపాటా?

మహేష్ బాబు నటించిన ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. సీఎం క్యారెక్టర్ తో మహేష్ బాబు మంచి టాక్ ను సంపాదించారు. అయితే సీఎం అయిన తర్వాత భరత్ వసుమతి అంటే హీరోయిన్ ను చూస్తాడు.

Written By: Neelambaram, Updated On : April 15, 2024 2:36 pm

Biggest Mistake In Bharat Ane Nenu

Follow us on

Bharat Ane Nenu: ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సమయంలో పొరపాటు చేస్తూనే ఉంటాడు. పొరపాటు చేయడం సహజం. కానీ ఆ పొరపాటు తెలుసుకున్న తర్వాత మళ్లీ మళ్లీ చేయకూడదు. అయితే సినిమాల్లో కూడా పొరపాట్లు జరుగుతుంటాయి. సినిమా విడుదల అయినా తర్వాత పొరపాట్లను సరి చేయడం కష్టం. అయితే సినిమా విడుదలైన వెంటనే అందులోని మిస్టెక్స్ ను గుర్తించకపోవచ్చు. తర్వాత మళ్లీ సినిమాను చూసినప్పుడు ఆ మిస్టెక్స్ గుర్తుపట్టవచ్చు. ఇక భరత్ అనే నేను సినిమాలో కూడా అదే తరహా పొరపాటు జరిగింది.ఇంతకీ ఏంటంటే..

మహేష్ బాబు నటించిన ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. సీఎం క్యారెక్టర్ తో మహేష్ బాబు మంచి టాక్ ను సంపాదించారు. అయితే సీఎం అయిన తర్వాత భరత్ వసుమతి అంటే హీరోయిన్ ను చూస్తాడు. తర్వాత ఆమెతో మాట్లాడుతాడు. ఇక సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న వసుమతి, తన చదువులో భాగంగా సీఎం ఆఫీస్ కు వస్తుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. అప్పుడే ఇది కలలా ఉన్నదే అనే పాట వస్తుంటుంది.

మీరు పైన చూస్తున్న స్టిల్ ఆ పాటలోనిదే.. అయితే ఇందులో కనిపిస్తున్న కార్లు మొత్తం బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ షాట్ ను బాగా గమనించండి. పైన తెలిసిన షాట్ కు కంటిన్యూ షాట్. మరి రెండింటిలో తేడా ఏంటనేది మీకు అర్థం అయిందా? ఒక షాట్ లో బ్లాక్ కలర్ లో ఉంటే మరో షాట్ లో వైట్ కలర్ లో ఉన్నాయి. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ సినిమాలోనే కాదు మరెన్నో సినిమాల్లో కూడా పొరపాట్లు ఉంటాయి. మరి దీనికి కారణం ఏంటి అనుకుంటున్నారా?

ఒక పాటకు సంబంధించిన షూట్ ఒకటే రోజు చిత్రీకరించరు. వాళ్ల సమయం, షెడ్యూల్స్ ను బట్టి షూట్ చేస్తుంటారు. ఒక సీన్ ఎక్కువ రోజులు షూట్ చేస్తే ఒకే గెటప్ లో ఉండాల్సి వస్తుంది యాక్టర్స్. అందుకే ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. కొన్ని సార్లు మిస్టెక్ అని తెలిసినా కూడా ఇలాంటి షాట్ లను తప్పకుండా పెట్టాల్సి వస్తుంది.