Bollywood: బాలీవుడ్ లో ఎవ్వరూ ఊహించని కాంబో.. సెట్ అవుతుందా?

షారుక్ ఖాన్ భన్సాలీ కి ఫోన్ చేసి సిరీస్ అద్భుతంగా తీశారు. అంటూ సిరీస్ గురించి మాట్లాడారట..ఇక అలానే మన కాంబినేషన్ లో కూడా ఒక సినిమా చేద్దామని షారుఖ్ ఖాన్ భన్సాలీ తో మాట్లాడినట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలైతే వస్తున్నాయి

Written By: Gopi, Updated On : May 17, 2024 2:56 pm

shah rukh khan sanjay leela bhansali

Follow us on

Bollywood: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన సంజయ్ లీలా భన్సాలీ రీసెంట్ గా హీరామండి అనే వెబ్ సీరీస్ ను తీశారు. ఇక ఈ సీరీస్ తో ఆయన మరోసారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆయన చేసిన ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపైతే లభించింది. ఇక ఈ సిరీస్ విమర్శకుల నుంచి ప్రశంసలను సైతం దక్కించుకుంటుంది.

ఈ సిరీస్ ని చూసిన షారుక్ ఖాన్ భన్సాలీ కి ఫోన్ చేసి సిరీస్ అద్భుతంగా తీశారు. అంటూ సిరీస్ గురించి మాట్లాడారట..ఇక అలానే మన కాంబినేషన్ లో కూడా ఒక సినిమా చేద్దామని షారుఖ్ ఖాన్ భన్సాలీ తో మాట్లాడినట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందు దేవదాస్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కూడా ఒక వైవిద్యమైన కథతో 200 కోట్ల బడ్జెట్ తో భన్సాలీ షారుఖ్ తో సినిమా చేయాలనే ప్లానింగ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం కథ రాసే పనుల్లో బిజీగా ఉన్న భన్సాలీ వెంటనే తన స్క్రిప్ట్ ని ఫైనల్ చేసి ఆయనతోనే సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా లో ఒక భారీ సక్సెస్ ను సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు కదులుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

మరి షారుక్ ఖాన్ తో చేయబోయే సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీ కొద్ది వరకు రికవరీ అవుతుందనే చెప్పాలి లేకపోతే మాత్రం టాలీవుడ్ డామినేషన్ ను తట్టుకోవడం బాలీవుడ్ హీరోలకి చాలా కష్టం అవుతుంది. ఇక ఇప్పటికే వరుస సినిమాలతో తెలుగు హీరోలు దండయాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు. మరి మనవాళ్ళ పోటీని తట్టుకోవడం షారుఖ్ ఖాన్ వల్ల అవుతుందేమో చూడాలి…