https://oktelugu.com/

Mahesh-Rajamouli: మహేష్-రాజమౌళి చిత్ర నిర్మాత కీలక ప్రకటన… అవన్నీ పుకార్లే అట!

జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ సిరీస్ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని రాజమౌళి వెల్లడించారు. యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్న రాజమౌళి...

Written By:
  • S Reddy
  • , Updated On : May 17, 2024 / 02:50 PM IST

    Mahesh-Rajamouli film producer key announcement

    Follow us on

    Mahesh-Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ చిత్రం ఫ్యాన్స్ కి చాలా ప్రత్యేకం. కారణం ఈ మూవీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్నారు. అలాగే మహేష్-రాజమౌళి మొదటి సారి కలిసి చిత్రం చేస్తున్నారు. ఈ డెడ్లీ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ. 800 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. ఎస్ఎస్ఎంబి 29 కథ, జోనర్ పై రాజమౌళి ఆల్రెడీ హింట్ ఇచ్చేశాడు.

    ఇది జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ సిరీస్ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని రాజమౌళి వెల్లడించారు. యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్న రాజమౌళి… మహేష్ బాబును ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా చూపించనున్నాడట. ఇక లుక్ పరంగా కూడా మహేష్ సరికొత్తగా కనిపించనున్నాడని సమాచారం. మహేష్ బాబు ఆల్రెడీ మేకోవర్ స్టార్ట్ చేశాడు. ఆ పాత్ర కోసం కసరత్తులు చేస్తున్నారు.

    మహేష్ లాంగ్ హెయిర్, గడ్డంతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా మహేష్ ఎస్ఎస్ఎంబి 29కి సన్నద్ధంలో భాగంగా చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎస్ఎస్ఎంబి 29 గురించి ప్రచారం అవుతున్న ఓ న్యూస్ ని నిర్మాతలు కొట్టిపారేశారు. ఎస్ఎస్ఎంబి 29 కాస్టింగ్ డైరెక్టర్ గా వీరేన్ స్వామి పని చేస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తల్లో నిజం లేదని దుర్గా ఆర్ట్స్ పిక్చర్స్ అధికారికంగా నోట్ విడుదల చేసింది.

    అలాగే సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా మేము స్వయంగా ఇస్తాము. మీరు పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. టోటల్ స్క్రిప్ట్ లాక్ చేసిన టీం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో నిమగ్నమయ్యారు. మరో రెండు మూడు నెలల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు కలవు. ఈ చిత్రంతో ఓ భారీ విజయం పై రాజమౌళి, మహేష్ బాబు కన్నేశారు. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యే సూచనలు కలవు.