Akhil Akkineni: ఎట్టకేలకు లెనిన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన నటుడు అఖిల్… ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ క్రేజ్ దక్కుతుంది. ప్రస్తుతం ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ దర్శకులు అఖిల్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలైతే వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న ‘సంజయ్ లీలా బన్సాలి’ లాంటి దర్శకుడు సైతం అఖిల్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటుండనే వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందట. ఇక రీసెంట్ గా అఖిల్ ని కలిసి తను ఒక కథను కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా సంజయ్ లీలా భన్సాలీ సైతం ప్రస్తుతం అంత మంచి ఫామ్ లో లేడు. కాబట్టి అఖిల్ తో సినిమా చేయడం అతనికి ప్లస్ అవుతుందేమో కానీ అఖిల్ ఇది మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
అఖిల్ మాత్రం రాబోయే సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. చాలా సంవత్సరాల తర్వాత రాక రాక వచ్చిన సక్సెస్ కాబట్టి ఈ సక్సెస్ ను కాపాడుకుంటు మరికొన్ని విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లినప్పుడు మాత్రమే ఆయన సక్సెస్ లను సాధించగలుగుతాడు.
లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది… ఇక రాబోయే రోజుల్లో అఖిల్ అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లగలుగుతాడా? టైర్ వన్ హీరోగా మారే అవకాశాలు అఖిల్ కి ఉన్నాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
మొత్తానికైతే అక్కినేని ఫ్యాన్స్ ఇప్పుడు ఆనంద పడుతున్నారనే చెప్పాలి. ఆయన ఇండస్ట్రీ కి వచ్చి 10 సంవత్సరాలు దాటినా కూడా సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయన ఇప్పటివరకు సక్సెస్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేశాడు. ఇక ఎట్టకేలకు ఒక భారీ సక్సెస్ ని దక్కించుకున్న ఆయన ఇక మీదట మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
