Homeఎంటర్టైన్మెంట్Balakrishna Mahesh Babu Movie: బాలయ్య - మహేష్ బాబు కాంబోలో మిస్ అయిన మూడు...

Balakrishna Mahesh Babu Movie: బాలయ్య – మహేష్ బాబు కాంబోలో మిస్ అయిన మూడు సినిమాలు…

Balakrishna Mahesh Babu Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మన హీరోలు తమ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక సీనియర్ హీరోలైన బాలయ్య బాబు లాంటి నటుడు సైతం ఇప్పటికీ వరుస సైడ్స్ లను సాధిస్తున్నాడు అంటే ఆయన సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. బాలయ్య బాబు గతంలో మహేష్ బాబుతో కలిసి ఒక సినిమాలో నటించాలనే ప్రయత్నం చేశాడు… ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో సింగీతం […]

Balakrishna Mahesh Babu Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మన హీరోలు తమ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక సీనియర్ హీరోలైన బాలయ్య బాబు లాంటి నటుడు సైతం ఇప్పటికీ వరుస సైడ్స్ లను సాధిస్తున్నాడు అంటే ఆయన సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. బాలయ్య బాబు గతంలో మహేష్ బాబుతో కలిసి ఒక సినిమాలో నటించాలనే ప్రయత్నం చేశాడు… ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో సింగీతం శ్రీనివాసరావు ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు… ఒక సోషల్ ఫాంటసీ కథ తో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు. కానీ అటు బాలయ్య బాబు, ఇటు మహేష్ బాబు ఇద్దరికీ కథ బాగా నచ్చింది. కానీ బడ్జెట్ విషయంలోనే చాలా వరకు తేడాలు రావడంతో ఈ సినిమాని సెట్స్ మీదకి రాక ముందే ఆపేశారు…

క్రియేటివ్ డైరెక్టర్ గా గొప్ప గుర్తింపు సంపాదించుకున్న కృష్ణవంశీ సైతం బాలయ్య – మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ అది కూడా కార్యరూపమైతే దాల్చలేదు…త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమాలో నటించాల్సింది. కానీ ఆ సినిమా కూడా వర్కౌట్ కాలేదు.

మొత్తానికైతే బాలయ్య – మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ప్రతి ఒక్కరు కోరుకున్నప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. కారణమేదైనా కూడా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఈ కాంబినేషన్ కోసం ఇప్పటికి ఎదురుచూస్తున్నారు. ఇక ఫ్యూచర్లో వీళ్ళిద్దరు కలిసి నటించే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ప్రస్తుతం బాలయ్య – గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు. వీళ్లిద్దరు హీరోలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper