Senior Heroes market growth in Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ల తర్వాత అంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లు ఉంటారు. ఈ నలుగురు ఇండస్ట్రీ కి నాలుగు పిల్లర్లుగా మారారు. చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నారు. వరుస విజయాలను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రేక్షకులు సైతం వాళ్ళ సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు సీనియర్ హీరోలుగా మారిన వీళ్లు ఇప్పటికీ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు.
ఇక ఈ సినిమా అందించిన విజయంతో చిరంజీవి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తున్నాడు. అలాగే బాలయ్య బాబు సైతం రాబోయే సినిమాలతో పెను సంచలనలను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. నాగార్జున తన వందో సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టలనే ప్రయత్నం ఉన్నాడు.
గత సంవత్సరం చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయన మరోసారి అదే ట్రాక్ లో ముందుకు దూసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ తో ఒక భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడు… ఈ సీనియర్ హీరోలందరు ఇప్పుడు వాళ్ళ మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్న క్రమంలో స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియాలో వల్ల పరిధిని పెంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక సీనియర్ హీరోలు ఇప్పటికి స్టార్ హీరోలకు పోటీని ఇస్తుండడం వల్ల వాళ్లు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలిగే కెపాసిటి ఉన్న స్టార్ హీరోలు సీనియర్ హీరోలకు భయపడాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఎందుకంటే వాళ్లతో సినిమాలను చేసి పోటీపడి రిలీజ్ చేయడానికి స్టార్ హీరోలు సైతం భయపడుతున్నారు… స్టార్ హీరోలకు పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ఉంటే సీనియర్ హీరోలకు తెలుగు రాష్ట్రాల్లో అంతకు మించి క్రేజ్ ఉంది…