Ramya Krishnan In Dragon: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ (Dragon) సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం చేసిన దేవర (Devara) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు ఆయన డ్రాగన్ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి రెండు వేల కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్లో సినిమా అయితే రాలేదు. మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇంతకుముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ (Salaar) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఈ సినిమాతోనే ప్రశాంత నీల్ తో సినిమా చేయాలని చాలామంది హీరోలు పోటీపడ్డప్పటికి ఆ అవకాశం ఎన్టీఆర్ కు మాత్రమే దక్కింది. మరి వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే ఈ సినిమాలో సీనియర్ నటి అయిన రమ్యకృష్ణ కూడా ఒక కీలకపాత్రలో కనిపించబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఎన్టీఆర్-రమ్యకృష్ణ కాంబినేషన్లో నా అల్లుడు(Naa Alludu) సినిమా వచ్చింది.
Also Read: ముచ్చటగా మూడవసారి తల్లి కాబోతున్న హీరోయిన్ జెనీలియా..ఫోటోలు వైరల్!
ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. వీళ్ళ కాంబినేషన్ మీద అప్పట్లో కొన్ని విమర్శలైతే వచ్చాయి. కానీ మొత్తానికైతే ఇప్పుడు ఈ సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటించబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె కనక ఈ సినిమాలో నటించినట్టైతే ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఎందుకంటే బాహుబలి సినిమాతో ఆమెకు పాన్ ఇండియాలో చాలా గొప్ప గుర్తింపైతే వచ్చింది. ఇక మరోసారి ఆమె ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించినట్లైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు అందరు ఆదరించడమే కాకుండా సినిమాను భారీ సక్సెస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి…
ఇక బాహుబలి తర్వాత ఆమెకు భారీ సినిమా ఒక్కటి కూడా పడలేదు. మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినప్పటికి అవి ఆమెకు ఏమాత్రం పేరు తీసుకురాలేదు. ఈ సినిమాతో ఆమె మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…