YCP Vs TDP: రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అంశాలపై టీడీపీ మహానాడులో(TDP Mahanadu) ఫుల్ ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేష్ ఆరు శాసనాలు ప్రవేశపెట్టి రాష్ర భవిష్యత్ కోసం అన్నట్లు ఆవిష్కరణలు చేశారు. రాష్ట్ర ప్రజల భవిత కోసం ఈ ఆవిష్కరణలు ఉన్నాయంటూ సర్వత్రా అభినందనలు అందుకుంటున్నారు నారా లోకేష్. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం పాత చింతకాయ వాసనలు అన్నట్టు కుట్రలు, కుతంత్రాలు , విష ప్రచారాలనే ఇప్పటికీ నమ్ముకుంటోంది. అయితే ఆ పార్టీ వైఖరి ఆది నుంచి అలానే ఉంది. కానీ గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ వ్యవహార శైలిని గుర్తించారు ఏపీ ప్రజలు. ఓటుతో ఆ పార్టీకి వేటు వేశారు. కానీ ఆ పార్టీలో ఎటువంటి మార్పు రాకపోవడం శోచనీయం.
Also Read: ప్రతినెలా 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఒకేలా పార్టీ శ్రేణుల ఆలోచన..
వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress)నేతల ఆలోచన ఒకేలా ఉంటుంది. ఆ పార్టీ శ్రేణులు సైతం అదే ఆలోచనను అనుసరిస్తుంటాయి. పార్టీలో ఇంతమంది మైండ్ సెట్ ఎందుకు ఒకేలా ఉంటుంది? ఇదేం పార్టీ విధానమో..సిద్ధాంతమూ కాదు కదా? ఎందుకీ వారి మైండ్ సెట్ అలా ఉంటుంది అంటే ముమ్మాటికీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డే కారణం. పార్టీని నడిపించే వ్యక్తి తన చర్యలు, హావభావాల వ్యక్తీకరణ ద్వారా చాలా ప్రభావితం చూపుతారు. చూపగలరు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సానుభూతి, సెంటిమెంట్ అనే భావోద్వేగాల నుంచి వచ్చిన నాయకుడు. అందుకే ప్రజల్లో నిత్యం భావోద్వేగాలను రేపగలిగితేనే ఆయన రాజకీయంగా రాణించగలడు. అయితే ఆయన భావోద్వేగంలో చిక్కుకున్న లక్షలా మంది ఆయన అభిమానులు అయ్యారు. మరికొందరు భక్తులుగా మారిపోయారు. నిన్నటికి నిన్న ఓ భక్తుడు జగన్ ఓటమికి..అరగుండు గీసుకొని మొక్కు చెల్లించుకున్నాడు. అయితే ప్రజల్లో భావోద్వేగం రెచ్చగొడితే కానీ..అదే ప్రజల్లో నిలదొక్కుకోలేనని తెలుసుకున్నవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ప్రయత్నాలు భూమరాంగ్ అవుతున్నాయి.
ఇప్పటికీ అదే ప్రచారం..
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఏడాది అవుతోంది. ప్రజుల దారుణంగా తిరస్కరించారు. జగన్ (YS Jaganamohanreddy) అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు మరోసారి అధికారం వస్తుందంటే భ్రమగా అనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు నరికేస్తాం.. కొరికేస్తాం అన్న మాట మరిచిపోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే పోలీసులను బట్టలూడదీసి నిలబెడుతాం అంటూ హెచ్చరించారు కూడా. దీంతో క్రిమినల్ మెంటాలిటీ బయటపడుతోంది. ఇదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. దానిని గుణపాఠంగా గుర్తించలేకపోతున్నారు. ఇంకా అరాచకానికి తమ మద్దతు ఉంటుందని.. విష ప్రచారం చేసి అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. అదే పనిగా ప్రభుత్వంపై విష ప్రచారం చేసి అడ్డంగా బుక్కవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చేస్తున్ ప్రయత్నాలన్నీ తిరిగి ఆ పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఓ నాలుగు ఘటనలు చూస్తే ఇది ఇట్టే అర్ధమైపోతోంది.
ఒక్కొక్కరిపై భారీగా కేసులు..
ఇటీవల తెనాలిలో (TENALI) గంజాయి నిందితుల విషయంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ వీడియోతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. టీడీపీ కూటమి సర్కారులో పౌర హక్కులు ఇలా మంటగలిశాయి అంటూ చేసిన పోస్టు విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే దీనిని ఫ్యాక్ట్ చెక్ పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ముగ్గురు నిందితులపై గంజాయి కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. పోలీసులు వద్దు అని వారించినా.. కౌన్సెలింగ్ ఇచ్చినా.. హెచ్చరికలు జారీచేసినా వారు వినడం లేదు. పైపెచ్చు ఓ కానిస్టేబుల్ పైనే దురుసుగా ప్రవర్తించారు. అందుకే పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ జుగుప్సాకరమైన రాజకీయానికి అలవాటుపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుణం కోణం తెచ్చి రాజకీయ లబ్ధికి పాకులాడుతోంది. సమాజాన్ని గంజాయి వనంలా మార్చుతున్న వారిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తుండడంపై స్థానకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
తిరుమలలో అరిచింది వైసీపీ నేత.
వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో తిరుమలలో(TIRUMALA) జరిగిన కార్యకలాపాలు అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డికి రాజగురువుగా ఉండే ఓ పీఠాధిపతి పెత్తనం తెలియంది కాదు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కూల్చివేత, కట్టడం తెలియంది కాదు. అన్యమతాల ఆగమనం, ప్రచారం తెలియంది కాదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమలలో అపచరాలు అంటూ విషప్రచారానికి దిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం వేసవి సెలవులు కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. వారి కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అంచనాలకు మించి భక్తులు వస్తున్నా ఏర్పాట్లు చేస్తోంది. కానీ ఓ భక్తుడు రూపంలో ఉన్న వైసీపీ నేత క్యూలైన్ లో టీటీడీకి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. అయితే ఫ్యాక్ట్ చెక్ తనిఖీలో కాకినాడకు చెందిన వైసీపీ నాయకుడు అచ్చారావు అని తేలింది. ఇది పక్కా వ్యూహంతోనే చేశారని తేలిపోయింది.
పిల్లాడి సైకిల్ పై పైశాచికం..
ప్రత్యర్థి పార్టీ గుర్తును కూడా సహించలేకపోతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. టీడీపీ గుర్తు సైకిల్ కనిపించేసరికి దానిని కసితీరా నేలకు కొట్టి ధ్వంసం చేసేవరకూ వదల్లేదు. మాజీ మంత్రి జోగి రమేశ్ (JOGI RAMESH) కుమారుడు వివాహం ఇటీవల ఇబ్రహింపట్నంలో జరిగింది. వివాహ వేడుకలు జరుగుతుండగా ఓ పిల్లాడు సైకిల్ తొక్కుకుంటూ అటువైపుగా వచ్చాడు. సహించలేకపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పిల్ల నాయకులు ఆ సైకిల్ ను నేలపై కొట్టి నాశనం చేశారు. వద్దు అంటూ ఆ పిల్లాడు ఏడుస్తున్నా పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అయితే ప్రత్యర్థి పార్టీల గుర్తులే వద్దనుకుంటే.. కాంగ్రెస్ గుర్తుగా చెయ్యి ఉంది. దానిని తెంచుకుంటారా? వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తు ఫ్యాన్. దానిని ప్రత్యర్థులు ఇళ్ల నుంచి తొలగించుకుంటారా? కానీ ఓ మైండ్ సెట్ తో వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏది చెప్పినా తలకు ఎక్కదు.
లోకేష్ ను పలుచన చేయాలని..
ఇప్పుడు అర్జెంట్ గా మంత్రి నారా లోకేష్ ను(NARA LOKESH) డీగ్రేడ్ చేయ్యాలి. ప్రజల్లో పలుచన చేయాలి. ఆయన నిర్వహిస్తున్న విద్యాశాఖలో ఫెయిల్యూర్స్ ను చూపించాలి. అందుకే పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో వైఫల్యాలను హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. రీ వాల్యూషన్ లో లోపాలు, తప్పులు, తడకలు.. ఇదివరకూ ఎన్నడూ లేని విద్యాశాఖ వైఫల్యాలు అంటూ విష ప్రచారానికి దిగింది. ఫలితాలు విడుదలయ్యాక కొన్ని పేపర్లలో తమకు తమకు సరిగా మార్కులు రాలేదు అని భావించినప్పుడు రీకౌంటింగ్, రీవెరిఫిషన్ కు కోరడం ఎప్పటినుంచో సహజంగా జరిగే ప్రక్రియ. గత నాలుగేళ్లలో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరిన విద్యార్థులు, ఆయా పేపర్లలో జరిగిన మార్పులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ కోసం 2022లో 41,694 దరఖాస్తులు రాగా.. అందులో 8,235 స్క్రిప్టులు (20శాతం), 2023లో 61,887 దరఖాస్తులు రాగా.. అందులో 10,987 స్క్రిప్టులు (18శాతం), 2024లో 55,930 దరఖాస్తులు రాగా.. 9,231 (17శాతం), 2025లో 66,363 దరఖాస్తులు రాగా.. 11,175 (18శాతం) స్క్రిప్టులకు సంబంధించి మార్కుల్లో మార్పులు రాగా… వాటిని సరిచేయడం జరిగింది. ఏటా జరుగుతున్న సహజ ప్రక్రియ ఇది. అయితే ఇదేదో ఈ విద్యాసంవత్సరంలో అయినట్టు విష ప్రచారం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది.ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 6,14,459మంది విద్యార్థులు హాజరుకాగా…34,709మంది విద్యార్థులు 66,363 పేపర్ల రీకౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 10,159 మంది విద్యార్థులకు సంబంధించి 11,175 స్క్రిప్టుల్లో మార్కుల తేడాలను గమనించి సరిచేశారు. అయితే ఇది లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ వైఫల్యం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ నాలుగు ఘటనలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ మెంటాలిటీని తెలియజేస్తున్నాయి. ప్రజలు దారుణంగా తిరస్కరించినా వారి వైఖరిలో మాత్రం మార్పు రాకపోవడం శోచనీయం..