Homeఎంటర్టైన్మెంట్Secret Behind Kajal's post కాజల్ పోస్ట్ వెనుక మర్మం ఇదేనా ?

Secret Behind Kajal’s post కాజల్ పోస్ట్ వెనుక మర్మం ఇదేనా ?

తెలుగు చిత్రసీమలో ఒక్క సినిమాతో స్టార్ డమ్ సంపాధించి పదేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలి, కెరీర్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి మంచి పాపులారిటీ సంపాదించుకున్న కాజల్, సీక్రెట్‌గా వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం నడిపి చివరకు గతేడాది కరోనా లాక్ డౌన్ తర్వాత అక్టోబర్ 30వ తేదీన పెళ్లాడింది. వివాహ అనంతరం భర్త వ్యాపారాల్లో పాలుపంచుకుంటూ, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ పేజ్‌లో పెట్టిన ఓ సందేశం నెట్టింట […]

తెలుగు చిత్రసీమలో ఒక్క సినిమాతో స్టార్ డమ్ సంపాధించి పదేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలి, కెరీర్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి మంచి పాపులారిటీ సంపాదించుకున్న కాజల్, సీక్రెట్‌గా వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం నడిపి చివరకు గతేడాది కరోనా లాక్ డౌన్ తర్వాత అక్టోబర్ 30వ తేదీన పెళ్లాడింది. వివాహ అనంతరం భర్త వ్యాపారాల్లో పాలుపంచుకుంటూ, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ పేజ్‌లో పెట్టిన ఓ సందేశం నెట్టింట హాట్ టాపిక్ అయింది.

 


ఇందుకు గల కారణం ‘ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్, వేచి ఉండండి’ అని కాజల్ స్వయంగా ప్రకటించడమే. అంతేకాదు దానిపై లవ్ సింబల్‌తో పాటు డాన్స్ చేస్తున్న ఎమోజీని జత చేసింది. ఇంకేముంది కాజల్ పోస్ట్ చూసి ఇది ఖచ్చితంగా కాజల్ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయమే అయివుంటుందని చెప్పుకుంటున్నారు అందరు.

కిచ్లును పెళ్లాడిన తర్వాత రెండు మూడు హనీమూన్ ట్రిప్స్ వేసి తిరిగి సెట్స్‌పై చేరిపోయిన ఈ కలువకళ్ల సుందరి భర్త అంగీకారంతో ఇప్పటికే కమిటైన సినిమాలు పూర్తి చేస్తూ వస్తోంది. అందుకేనేమో డేట్స్ ఇచ్చిన సినిమాలు తప్ప కొత్త సినిమాలకు ఓకే చెప్పట్లేదని అంటున్నారు బీ టౌన్ వర్గాలు. అందుకే నాగార్జున సినిమా నుంచి ఆమెను తప్పించారని కొందరు అనుకుంటున్నారు. వేచి చూడండి మరి కాజల్ ఇదే గుడ్ న్యూస్ చెబుతుందా, లేక తన కొత్త ప్రాజెక్టులు కానీ, వ్యాపారంలో అప్‌డేట్ ఇస్తుందా అనేది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper