Dhulipalla Narendra: ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి వంత పాడుతూ ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టే క్రమంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో ఆరోపణలు చేసుకోవడం సాధారణం. కానీ వాటిని బూతద్దంలో చూస్తూ వారిని బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవడం పలు అనుమానాలు వస్తున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో ధూళిపాళ్ల నరేంద్ర చేసిన ఆరోపణలపై సాక్ష్యాలివ్వాలని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది.

చింతలపూడిలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంపై ఏపీలో పెద్ద రచ్చ జరుగుతుండగా పోలీసుల తీరుపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో చంద్రబాబు, లోకేష్ పై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం అధికార పార్టీకి వత్తాసు పలకడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వారి వ్యవహారం మొత్తం చర్చనీయాంశంగా మారుతోంది.
గతంలో చంద్రబాబుకు సైతం నోటీసులు జారీ చేసిన పోలీసులు విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాల్సిన వారు ప్రతిసారి విమర్శలు ఎదుర్కోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే దానికి జై కొట్టడం వంటి పనులు చేయడంతో పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు పార్టీల కోసం పనిచేయడమేమిటని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిపై ఆరోపణలు వచ్చినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నేతల ప్రాపకం పొందేందుకు పాకులాడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాగైతే ఇంకా పోలీస్ శాఖపై విమర్శలు తప్ప మంచి అభిప్రాయం ఉండదని తెలిసినా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు.