Sathyam Sundaram: ‘సత్యం సుందరం’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలను కూడా డామినేట్ చేస్తుందిగా!

'దేవర' లాంటి చిత్రాన్ని ముందు పెట్టుకొని నైజాం ప్రాంతం లో ఇలాంటి వసూళ్లు రాబట్టడం అనేది చిన్న విషయం కాదు. అదే విధంగా సీడెడ్ లో ఈ చిత్రానికి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు ఇప్పటి వరకు వచ్చాయట.

Written By: Vicky, Updated On : October 8, 2024 2:18 pm

Sathyam Sundaram

Follow us on

Sathyam Sundaram: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సైలెంట్ సూపర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘సత్యం సుందరం’. కార్తీ, అరవింద్ స్వామి హీరోలుగా నటించిన ఈ సినిమాకి మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక నవల ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘దేవర’ చిత్రం మేనియా లో విడుదల అవుతున్న ఈ సినిమాని మొదట్లో ట్రేడ్ చాలా తక్కువ అంచనాలు వేసింది. అంతటి భారీ బడ్జెట్ చిత్రం ముందు ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు, నిర్మాతలు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు అని విడుదలకు ముందు అనేక కామెంట్స్ వినిపించాయి. కానీ మంచి సినిమాని ప్రేక్షకులు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై 10 రోజులు పూర్తి అయ్యింది. ప్రాంతాల వారీగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ఒక్క నైజాం ప్రాంతంలోనే ఈ చిత్రానికి దాదాపుగా 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

‘దేవర’ లాంటి చిత్రాన్ని ముందు పెట్టుకొని నైజాం ప్రాంతం లో ఇలాంటి వసూళ్లు రాబట్టడం అనేది చిన్న విషయం కాదు. అదే విధంగా సీడెడ్ లో ఈ చిత్రానికి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు ఇప్పటి వరకు వచ్చాయట. ఉత్తరాంధ్ర ప్రాంతం లో 80 లక్షలు, గోదావరి జిల్లాలకు కలిపి 50 లక్షలు, కృష్ణ మరియు గుంటూరు జిల్లాలకు కలిపి 65 లక్షలు, నెల్లూరు జిల్లాలో 30 లక్షలు, ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం 10 రోజుల్లో 4 కోట్ల 95 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే కర్ణాటక, ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి తెలుగు వెర్షన్ వసూళ్లు మరో కోటి రూపాయిల షేర్ వచ్చిందని, ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ దసరా కి కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

ఓవరాల్ గా ఫుల్ రన్ లో మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇక తమిళ వెర్షన్ వసూళ్లు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటేసింది అంటున్నారు. ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడం కష్టమే కానీ, కచ్చితంగా 70 కోట్ల రూపాయిల మార్క్ ని అందుకుంటుందని అంటున్నారు. నేరుగా ఓటీటీ లో విడుదల చేయాలని అనుకున్న ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ పరంగా ఇంత వసూళ్లను రాబట్టడం అనేది చిన్న విషయం కాదు. ఇలాంటి కొత్త రకం ప్రయోగాత్మక చిత్రాలు కార్తీ భవిష్యత్తులో చేయడానికి ఈ ‘సత్యం సుందరం’ చిత్రం ఎంతో బూస్ట్ ని ఇచ్చింది అని చెప్పొచ్చు.