https://oktelugu.com/

Maa Nanna Superhero: ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ మొట్టమొదటి రివ్యూ..సుధీర్ బాబు కి ఈసారైనా అదృష్టం కలిసి వస్తుందా?

'మా నాన్న సూపర్ హీరో' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు, షాయాజీ షిండే ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే 'మా నాన్న సూపర్ హీరో' అని టైటిల్ పెట్టారు, టీజర్ చూస్తే హీరో కి నాన్న ఎవరో అర్థం కావడం లేదు, అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవాలి అనే ఆత్రుత ప్రేక్షకుల్లో కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 8, 2024 / 02:28 PM IST

    Maa Nanna Superhero

    Follow us on

    Maa Nanna Superhero: సినీ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ తో పాటు, అందం, టాలెంట్ రెండు ఉన్నప్పటికీ కూడా సక్సెస్ కాలేకపోయినా హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సుధీర్ బాబు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతను ఇప్పటి వరకు 23 సినిమాల్లో నటించాడు. కానీ ఈయన కెరీర్ లో కేవలం ‘ప్రేమ కథా చిత్రం’ తప్ప ఒక్కటంటే ఒక్క భారీ బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి వచ్చిన కుర్రాడు, పైగా అతని బావ మహేష్ బాబు ఈ జనరేషన్ లో పెద్ద సూపర్ స్టార్, అయినప్పటికీ కూడా సక్సెస్ కాలేకపోయాడంటే సుధీర్ బాబు దురదృష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టాలెంట్ లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు, కానీ బోలెడంత టాలెంట్ పెట్టుకొని కూడా కనీస స్థాయి మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోవడం నిజంగా ఆయన దురదృష్టమే. ఆయన గత చిత్రం ‘హరోం హర’ కమర్షియల్ హిట్ స్టేటస్ కి చాలా దగ్గరగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ కి మంచి టాక్ వచ్చినప్పటికీ, సెకండ్ హాఫ్ మొత్తం పుష్ప సినిమాని చూసినట్టే ఉందని టాక్ రావడంతో కమర్షియల్ గా పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది.

    కానీ ఇప్పుడు ఆయన ‘మా నాన్న సూపర్ హీరో’ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు, షాయాజీ షిండే ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ‘మా నాన్న సూపర్ హీరో’ అని టైటిల్ పెట్టారు, టీజర్ చూస్తే హీరో కి నాన్న ఎవరో అర్థం కావడం లేదు, అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవాలి అనే ఆత్రుత ప్రేక్షకుల్లో కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రివ్యూ షో టాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖులకు ప్రత్యేకంగా వేసి ఇటీవలే చూపించారు.

    ఈ ప్రివ్యూ షో నుండి బయటకి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధాన్ని డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర అద్భుతంగా చూపించాడని, షియాజీ షిండే ని ఇన్ని రోజులు విలన్ రోల్స్ లో, కామెడీ రోల్స్ లో మాత్రమే చూశామని, కానీ ఆయనలో ఇంత ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటుందని ఈ సినిమాని చూసిన తర్వాతనే అర్థం అయ్యిందని, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు డైరెక్టర్ ఆడియన్స్ చేత వెక్కిళ్లు పెట్టి ఏడ్చేలా చేసాడని, సరిగ్గా ప్రమోట్ చేసుకుంటే సుధీర్ బాబు కెరీర్ లో ఈ చిత్రం ది బెస్ట్ గా నిలిచిపోతుందని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.