Sankranthiki Vasthunam
Sankranthiki Vasthunam: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ గా నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది ఈ సినిమా. ఎఫ్2, ఎఫ్3 వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత అనిల్ రావిపూడి,వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇక ఈ సినిమాలో హీరో వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ కు కొడుకుగా నటించిన బుల్లి రాజు కామెడీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా కేవలం రెండు వారాల్లోనే రూ. 276 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ లో కూడా 2.7 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టింది. ఇక వచ్చే నెల ఫిబ్రవరి రెండవ వారం వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జి 5 సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ సినిమాను ఫిబ్రవరి 2వ వారంలోనే స్ట్రీమింగ్ చేయాలని ముందుగానే అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. వసూళ్లు కూడా భారీ రేంజ్ లో వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీలో ఈ సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. జి5 ను ఈ సినిమా మేకర్స్ ఓటిటి విడుదలను వాయిదా వేయమని రిక్వెస్ట్ చేస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నాయి.
ఒకవేళ ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడం ఆలస్యం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రూ. 300 కోట్లకు చేరువలో ఉన్నాయని సమాచారం. దాంతో ఈ సినిమా ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Sankranthiki vasthunam movie is the leading ott company that has acquired the streaming rights
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com