Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కొత్త ప్లాన్ ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు సినిమాలలో రిస్క్ చేసిన రౌడీ బాయ్ ఇకపై నో రిస్క్, ఓన్లీ ఫోకస్ అనే ఫార్ములాను ఫాలో అవ్వబోతున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా ను అప్లై చేస్తున్నారు. ఇక VD12 సినిమా కోసం ఈ రౌడీ హీరో ఏం చేయబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ సినిమా కెరియర్ కు ఎవరి దిష్టో బాగా తగిలింది అని చెప్పొచ్చు. కెరియర్ స్టార్టింగ్ లో రాకెట్ లాగా దూసుకుపోయిన ఈ రౌడీ హీరో ఆ తర్వాత మాత్రం జోరు తగ్గించారు. బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమాలన్నీ బెడిసి కొట్టాయి. విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓకే అనిపించిన ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ నిరాశపరిచింది. అయితే ఇటీవలే విజయ్ దేవరకొండ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ లో మార్పులు బాగానే కనిపిస్తున్నాయి అని తెలుస్తుంది. గతంలో విజయ్ దేవరకొండ లైగర్ చేస్తున్న సమయంలోనే ఖుషి, అది సెట్స్ పై ఉన్నప్పుడే గౌతమ్ సినిమా, ఇక ఆ సినిమా పూర్తి అవ్వకముందే ఫ్యామిలీ స్టార్ కి ఓకే చెప్పడం జరిగింది. ఇకపై ఈ కన్ఫ్యూజన్స్ ఏమి లేకుండా ఒక్కసారి ఒక సినిమా మాత్రమే అంటున్నారు విజయ్ దేవరకొండ. నిధానమే ప్రధానం అంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికి రెండు సినిమాలు ఫైనల్ చేశారు. ఇక విజయ్ గౌతమ్ తిన్ననూరి సినిమాలో పోలీసు పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రాహుల్ సంక్రిత్యన్ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెట్ వరకు ప్రారంభమైంది.
18వ శతాబ్దపు కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పూర్తిగా రూలర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానుంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ నువ్విలా అనే సినిమాతో 2011లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాలో తన పాత్ర కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. పెళ్లిచూపులు అనే సినిమాతో హీరోగా మారారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో హీరోగా తన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నారు.
ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి అనే సినిమాలో హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును కూడా తీసుకున్నారు. తెలుగులో టాక్సీవాలా, గీతగోవిందం, మహానటి వంటి సినిమాలలో కూడా నటించారు. ఇక గీతా గోవిందం సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకుంది. ఆ తర్వాత భారీ బడ్జెట్ సినిమా లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది.