https://oktelugu.com/

Sankranthiki Vasthunam OTT: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ చూసిన ఆడియన్స్ కి షాక్, కారణం ఇదే! డైరెక్టర్ ఇలా చేశాడేంటి?

వెంకటేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆడియన్స్ ఓటీటీ వెర్షన్ చూసి షాక్ అయ్యారు. వారు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఇలా ఎందుకు చేశాడనే వాదన మొదలైంది...

Written By:
  • S Reddy
  • , Updated On : March 2, 2025 / 12:56 PM IST
    Sankranthiki Vasthunam

    Sankranthiki Vasthunam

    Follow us on

    Sankranthiki Vasthunam OTT: బాలకృష్ణ, రామ్ చరణ్ వంటి బడా స్టార్స్ తో పోటీపడిన వెంకటేష్ 2025 సంక్రాంతి విన్నర్ అయ్యాడు. ఏకంగా రూ. 300 కోట్లు కొల్లగొట్టాడు. సోలోగా 50 కోట్లు సాధించడమే కష్టం అనుకుంటున్న సమయంలో అందుకు ఐదారు రెట్ల కలెక్షన్స్ రాబట్టాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. గేమ్ ఛేంజర్ ప్లాప్ కాగా, డాకు మహారాజ్ జస్ట్ హిట్ అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకర్షించిన సంక్రాంతికి వస్తున్నాం ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయేలా కలెక్షన్స్ రాబట్టింది.

    Also Read: సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కోసం ఆ స్టోరీ ని రెడీ చేశారా..? కథ మామూలుగా లేదుగా…

    సంక్రాంతికి వస్తున్నాం విడుదలై నెల రోజులు దాటిపోయింది. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ జీ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓటీటీలో, టీవీలో ఏక కాలంలో స్ట్రీమ్ చేశారు. మార్చ్ 1 నుండి జీ 5లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ స్ట్రీమ్ అవుతుంది. కాగా ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం నయా వెర్షన్ దర్శనమిచ్చింది. అనగా.. ఈ మూవీ రన్ టైం 2 గంటల 24 నిమిషాలు, కానీ ఓటీటీ వెర్షన్ నిడివి 2 గంటల 16 నిమిషాలు మాత్రమే. దాదాపు 10 నిమిషాలు తొలగించారు. ఓటీటీ వెర్షన్ లో మరికొన్ని కామెడీ సన్నివేశాలు జోడించి విడుదల చేస్తారని ప్రేక్షకులు భావించారు. అందుకు భిన్నంగా ఓటీటీ వెర్షన్ ఉంది.

    దర్శకుడు అనిల్ రావిపూడి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది అర్థం కాలేదు. సంక్రాంతికి వస్తున్నాం మూవీని దిల్ రాజు నిర్మించాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. భీమ్స్ సంగీతం అందించారు. ఆయన సాంగ్స్ సూపర్ హిట్. భారీ ఆదరణ దక్కించుకున్నాయి. ఇక బుల్లిరాజు పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది.

    దిల్ రాజును సంక్రాంతికి వస్తున్నాం భారీ నష్టాల నుండి బయటపడేసింది. గేమ్ ఛేంజర్ మూవీతో పెద్ద మొత్తంలో దిల్ రాజు నష్టపోయాడు. ఆ మూవీ నష్టాన్ని సంక్రాంతికి వస్తున్నాం రికవరీ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు.

    Also Read: రాజమౌళి మహేష్ బాబు ను ఆ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి కారణం ఏంటి..? ఆయన మామూలోడు కాదురా బాబు…