Mahesh Babu Sandeep Reddy Movie Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో సందీప్ రెడ్డివంగా ఒకరు. ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…ఇక రాజమౌళి తర్వాత అంతటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఇక ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలోనే చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు…గతంలో ఆయన మహేష్ బాబుకి ఒక కథను కూడా వినిపించాడు. మహేష్ బాబు ఆ సినిమాని చేయాలని కొద్దిగా సంకోచించినట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలోనే అనిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన మహేష్ బాబు ను ఉద్దేశించి సందీప్ వంగ కీలక వ్యాఖ్యలైతే చేశాడు. మహేష్ బాబు కోసం ఇంతకంటే వైలెంట్ గా ఒక స్క్రిప్ట్ అయితే రెడీగా ఉందని చెప్పాడు. మరి ఈ విషయాన్ని విన్న మహేష్ బాబు అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అయితే మహేష్ బాబుతో ఏఎంబి మాల్లో పార్టనర్ గా ఉంటున్న ఏషియన్ సునీల్ ఇప్పటికే సందీప్ రెడ్డి వంగకు అడ్వాన్స్ అయితే ఇచ్చాడు. ఇక అందులో భాగంగానే ఆయనతో ఒక సినిమా చేయాల్సిన సందర్భంలో ఏషియన్ సునీల్ మహేష్ బాబుతో సినిమా చేద్దామని సందీప్ తో చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఒకవేళ ఈ ప్రాజెక్టు కనక కన్ఫర్మ్ అయితే మాత్రం మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. ఎందుకంటే సందీప్ రెడ్డివంగా తన హీరోలను ఏ రేంజ్ లో చూపిస్తాడో మనందరికి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే అతనిలో చేంజ్ ఓవర్ ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాడు…
ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలోనే సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మహేష్ బాబు సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం సందీప్ రెడ్డివంగ అతని కోసం ఆల్రెడీ కథనైతే రెడీ చేసి పెట్టాడు. మరి వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అవుతోందా? లేదా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది…