Arab-Islamic NATO: ఇజ్రాయెల్ ఇటీవల ఖతార్ రాజధాని దోహాపై దాడిచేసింది. హమాస్ కీలక నేతలు సమావేశమయ్యారని తెలుసుకున్న ఐడీఎఫ్.. సైలెంట్‌గా దాడిచేసింది. దీంతో అప్రమత్తమైన ముస్లిం దేశాలు ఖతార్‌పై దాడిని ఖండించారు. సెప్టెంబర్ 15న దోహాలో జరిగిన అరబ్–ఇస్లామిక్ అత్యవసర సమ్మిట్‌లో 57 ముస్లిం దేశాల నాయకులు సమావేశమై, ఇస్రాయెల్ చర్యలను ఖండించారు. ఈ సమ్మిట్, ఒక్క ముస్లిం దేశంపై దాడి అందరిపైనా జరిగినట్లుగా పరిగణించాలని నిర్ణయించింది. నాటో తరహాలో ఇస్లామిక్ రక్షణ వ్యవస్థ ఏర్పాటును మళ్లీ చర్చలోకి తెచ్చింది. ఈ ప్రతిపాదన, మునుపటి ప్రయత్నాల్లో విఫలమైనప్పటికీ, ప్రస్తుత సంక్షోభంతో మళ్లీ తెరపైకి తెచ్చాయి.
ఖతార్‌పై దాడితో ఐక్యతారాగం..
సెప్టెంబర్ 9న ఇజ్రాయెల్ ఖతార్‌లోని హమాస్ నాయకుల సమావేశాన్ని లక్ష్యంగా చేసుకుని గాలి దాడి చేసింది, దీనిలో ఐదుగురు హమాస్ సభ్యులు మరియు ఒక ఖతార్ భద్రతా అధికారి మరణించారు. ఈ దాడి, అమెరికా ప్రస్తావించిన గాజా యుద్ధ విరామ చర్చల మధ్య జరిగినప్పటికీ, ఖతార్ దేశీయతకు విరుద్ధమని, ’రాష్ట్ర ఉగ్రవాదం’గా ఖండించబడింది. ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ తానీ, ఈ దాడిని ’నిష్ఠురమైన, మోసపూరితమైన’గా వర్ణించారు, మరియు ఇది మధ్యప్రాచ్య శాంతిని బెదిరిస్తుందని హెచ్చరించారు. ఈ ఘటన, సంపన్న గల్ఫ్ దేశాలైన ఖతార్, కువైట్, యూఏఈ వంటి దేశాల రక్షణ బలహీనతను బహిర్గతం చేసింది. ఈ దేశాలు ఆర్థికంగా బలోపేతంగా ఉన్నప్పటికీ, ఇరాన్, ఇరాక్ వంటి పొరుగు దేశాల దాడులకు గురైనప్పుడు తగిన సైనిక శక్తి లేకపోవడం వల్ల భయపడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడి, ఈ భయాలను మరింత ఊతమించింది. ముస్లిం దేశాల ఐక్యతకు దోహదం చేసిది. ఫలితంగా, అరబ్ లీగ్ (22 సభ్య దేశాలు), ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఐసీవో 57 సభ్య దేశాలు) ఐక్యంగా సమ్మిట్ నిర్వహించాయి, దీనిలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజేష్కియాన్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తాహ్ ఎల్–సిసీ వంటి నాయకులు పాల్గొన్నారు.
ఇస్లామిక్ నాటో ప్రతిపాదన..
ఇస్లామిక్ మిలిటరీ అలయన్స్ లేదా ’అరబ్ నాటో’ ప్రతిపాదన, కొత్తది కాదు. అరబ్ స్ప్రింగ్ తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 2015లో సౌదీ అరేబియా 34 ఇస్లామిక్ దేశాలను ఐక్యం చేసే పిలుపు ఇచ్చింది, కానీ సార్వభౌమాధికార ఆందోళనల వల్ల విఫలమైంది. అదే సంవత్సరం ఈజిప్టు–సౌదీలు మళ్లీ ప్రతిపాదించాయి, కానీ ముందుకు సాగలేదు. ప్రస్తుతం, ఖతార్ దాడి ఈ ఆలోచనను మళ్లీ ఆవిష్కరిస్తోంది. సమ్మిట్‌లో ఈజిప్టు, ఖైరోలో అరబ్ నాటో కార్యాలయం ఏర్పాటును ప్రతిపాదించింది. ఈజిప్టు 20 వేల సైనికులను అందించాలని ప్రకటించింది, రొటేషన్ ఆధారంగా నాయకత్వం మార్చాలని సూచించింది. వివిధ దళాలు, కమాండోలు, సైనిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. పాకిస్తాన్, ఇరాన్ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి. సౌదీ అరేబియా ప్రకారం, టర్కీ, ఇరాన్, ఇరాక్, ఈజిప్టు, ఇండోనేషియా వంటి 60 దేశాలు చేరే అవకాశం ఉంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) కూడా ఐక్య రక్షణ మెకానిజమ్‌ను సక్రియం చేయాలని ప్రకటించింది. ఇది బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ, యూఏఈలను కవర్ చేస్తుంది. ఈ ప్రతిపాదన, ఒక్క ఇస్లామిక్ దేశంపై దాడి జరిగినా అందరిపైనా జరిగినట్లు భావించాలని నిర్ణయించింది. ఇరాన్ అధ్యక్షుడు పెజేష్కియాన్, ’ఇస్లామిక్ క్యాపిటల్స్‌పై దాడులు కొనసాగితే’ ఐక్య ఆపరేషన్స్ రూమ్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, ఇజ్రాయెల్‌పై ఆర్థిక ఒత్తిడి, అంతర్జాతీయ చట్టాల ద్వారా శిక్షలు విధించాలని సూచించారు.
ఈ ఐక్యత, ముస్లిం దేశాలకు బలమైన రక్షణ కవచాన్ని అందించగలదు. 22 అరబ్ దేశాలు, పాకిస్తాన్ వంటి సైనిక శక్తి ఉన్న దేశాలు కలిసి, ఇజ్రాయెల్ వంటి శత్రువులతో తలపడే సామర్థ్యాన్ని పొందవచ్చు. పాకిస్తాన్‌కు ఇది కశ్మీర్‌లో భారత్‌పై ఒత్తిడి పెంచే అవకాశాన్ని కల్పిస్తుంది, ఎందుకంటే ఐక్య సైన్యం ఏర్పడితే తమ సైనిక బలాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే, అమెరికాకు వ్యతిరేకత, ్ఖ ఇజ్రాయెల్‌ను కాపాడుతున్నందుకు, ముస్లిం దేశాలు ఐక్యంగా చర్యలు తీసుకుంటే భారీ ప్రభావం చూపుతుంది. గత అనుభవాలు, ఆర్థిక బాయ్‌కాట్‌లు ఇజ్రాయెల్‌ను బలహీనపరచాయని ఎర్డోగాన్ పేర్కొన్నారు. కానీ షియా, సున్నీ వివాదం ముస్లిం దేశాలన కలనీయడం లేదు. భవిష్యత్తులో, ఈ ప్రతిపాదన విజయవంతమైతే మధ్యప్రాచ్య భద్రతా వ్యవస్థ మారిపోతుంది.