Sandeep Reddy Vanga : ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులలో సందీప్ రెడ్డివంగ (సందీప్ Reddy Vanga) ఒకరు. ఆయనను మించిన దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనెంతలా గుర్తింపును సంపాదించుకున్న ఆయన తీసింది రెండు సినిమాలే అయినప్పటికి ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను అందుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఇండస్ట్రీలో ఎవరికి దక్కనటువంటి ఒక గొప్ప గౌరవాన్ని కూడా దక్కించుకున్నాడు. అనిమల్ (Animal) సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగాడు… అయితే ఈయన సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని దానివల్లే ఆయన సినిమాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయంటూ కొంతమంది కామెంట్లు అయితే చేస్తూ ఉంటారు. నిజానికి కంటెంట్ తో ప్రేక్షకుడు కనెక్ట్ అయినప్పుడు మాత్రమే సినిమా సక్సెస్ అవుతుంది ఆ ఎమోషన్ ని ప్రేక్షకులు ఫీలయినప్పుడే అతడు రిపీటెడ్ గా సినిమాని చూడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అంతేతప్ప బోల్డ్ సీన్స్ చేయడం వల్ల సినిమాలు ఆడవు అంటూ సందీప్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తున్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం సందీప్ రెడ్డివంగ మీద కొంతవరకు నెగిటివ్ టాక్ అయితే నడుస్తోంది.
Also Read : సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు కాంబోలో సినీమా వచ్చే అవకాశాలు ఉన్నాయా..?
మరి ఏది ఏమైనా కూడా సందీప్ తన సినిమాలో బోల్డ్ సీన్స్ కావాలి కాబట్టి పెడుతున్నాను అంతే తప్ప బోల్డ్ సీన్స్ కోసమే నేను కథని రాసుకోవడం లేదు అంటూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది బాలీవుడ్ మాఫియా జనాలు సైతం అతనిని విమర్శించే ప్రయత్నం అయితే చేశారు. కానీ వాళ్ళకి కూడా ఆయన మొదటి నుంచి చాలా గట్టి కౌంటర్ అయితే ఇస్తూ వస్తున్నాడు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉండటం మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఆయన లాంటి ఒక బెస్ట్ మేకర్ ఇప్పటివరకు ఇండస్ట్రీలో రాలేదనే చెప్పాలి. శివ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో అన్ని క్రాఫ్ట్ లలో కొత్తదనాన్ని చూపించిన దర్శకుడిగా ఆయనకు ఒక మంచి గుర్తింపైతే లభించింది.
మరి ఇకమీదట రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు. తద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. అనే విషయాలు తెలియదు కానీ మొత్తానికైతే ఆయన ఒక మంచి మేకర్ గా మిగిలిపోతాడు అనేది మాత్రం వాస్తవం. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ (Spirit) సినిమా విషయంలో కూడా ఆయన ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా తనకు నచ్చినట్టుగా సినిమాను చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
Also Read : స్పిరిట్ సినిమాలో కొత్త ప్రభాస్ ను చూడబోతున్నారు : సందీప్ వంగ…