Sandeep Reddy Vanga and Mahesh Babu : అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా తీసే విధానాన్ని మార్చేసిన దర్శకుడు సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga) ఒకప్పుడు శివ (Shiva) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రభంజనం అయితే మొదలైంది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లందరు అదే విధానాన్ని ఫాలో అవుతూ సినిమాలు చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుడు వచ్చి టోటల్ గా సినిమా తీసే విధానాన్ని మార్చేశాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో చేసిన అనిమల్ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేస్తున్నాడు. నిజానికి ఆయన ఇప్పుడు మహేష్ బాబు తో ఒక సినిమా చేయాల్సింది. కానీ మహేష్ బాబు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉండడం వల్ల వీళ్ళ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా లేట్ అయిందనే చెప్పాలి. ఇక స్పిరిట్ సినిమాతో ప్రభాస్ ను చాలా కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారట. మరి మహేష్ బాబు లాంటి హీరోతో సినిమా చేయకపోయిన కూడా ప్రభాస్ తో చేస్తున్న సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించి ఇండియాలోనే ఈ సినిమాని నెంబర్ వన్ సినిమాగా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారట.
Also Read : మహేష్ బాబు తో పోటీ పడి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న హీరోలు వీళ్లేనా..?
ఇప్పటికే ఈ సినిమాను పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కించే ప్రయత్నంలో సందీప్ రెడ్డివంగ ఉన్నాడు. ఇక తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతుంది. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక సపరేటు క్రేజ్ ను సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంలో సందీప్ రెడ్డివంగా ఉన్నాడు.
తను అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికైతే ప్రభాస్ ని ఒక డిఫరెంట్ లుక్ లో చూపించడానికి మాత్రం సందీప్ సిద్ధంగా ఉన్నానని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…
సందీప్ రెడ్డివంగ గురించి మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన ఒక సబ్జెక్టుని ఎంచుకున్నాడు అంటే దాన్ని చాలా కాన్ఫిడెంట్ గా తెరమీద చూపించే ప్రయత్నమైతే చేస్తూ ఉంటాడు… అందుకే అతనికి సినిమాలకే కాకుండా అతనికి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు…
Also Read : మహేష్ బాబు సందీప్ వంగ సినిమాను వదిలేయడానికి అసలు కారణం ఏంటో తెలిసిపోయిందిగా…