Homeఎంటర్టైన్మెంట్Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం 'క' చిత్రానికి అరుదైన గౌరవం!

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రానికి అరుదైన గౌరవం!

Kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చెప్పి మరీ హిట్ కొట్టాడు. ఆయన నటించిన ‘క’ ప్రేక్షకుల ఆదరణ పొందింది. గత ఏడాది డిసెంబర్ లో ‘క’ విడుదలైంది. ఈ చిత్రానికి పోటీగా అమరన్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. అవి రెండు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాల నుండి గట్టి పోటీ ఎదుర్కొంది క మూవీ. అయితే మూవీని వినూత్నమైన కథతో దర్శకులు తెరకెక్కించారు. దాంతో క మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

Also Read : దిల్ రూబ’ సున్నా షేర్ తో కిరణ్ అబ్బవరం అరుదైన రికార్డు!

క మూవీ వరల్డ్ వైడ్ రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఆ సినిమా బడ్జెట్ రీత్యా క ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. క మూవీకి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దక్కలేదు. లేదంటే వసూళ్లు మరింత మెరుగ్గా ఉండేవి. క చిత్రానికి సుజిత్, సందీప్ అనే ఇద్దరు యువ దర్శకులు దర్శకత్వం వహించారు. మొదటి చిత్రంతోనే భారీ విజయం నమోదు చేశారు. నయన్ సారిక, తన్వి రామ్ ఇతర ప్రధాన పాత్రలు చేశారు.

క చిత్రాన్ని అరుదైన గౌరవం వరించింది. దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో క చిత్రాన్ని ప్రదర్శించారు. ఉత్తమ చిత్రంగా క అవార్డు కైవసం చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క మూవీకి రెండో భాగం ఉందని ఇదివరకే యూనిట్ ప్రకటించారు. క పార్ట్ 2 మరింత ఉత్కంఠ రేపే సబ్జెక్టుతో సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు.

క మూవీ కథ విషయానికి వస్తే.. అభినయ్ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) అనాథ. ఓ మారుమూల గ్రామానికి అతడు టెంపరరీ పోస్ట్ మాన్ గా వెళతాడు. అక్కడి ప్రజలతో మమేకం అవుతాడు. ఈ క్రమంలో పోస్ట్ మాస్టర్ కుమార్తెతో ప్రేమలో పడతాడు. చిన్నప్పటి నుండి ఇతరుల ఉత్తరాలు చదవడం అలవాటుగా ఉన్న అభినయ్ కి ఆ ఊరిలో మిస్ అవుతున్న అమ్మాయిల గురించి తెలుస్తుంది. అమ్మాయిలను మాయం చేస్తున్న మాఫియా వెనకుంది ఎవరు? వారి నుండి ఆ గ్రామాన్ని అభినయ్ ఎలా రక్షించాడు? అసలు క అంటే అర్థం ఏమిటో? సినిమా చూసి తెలుసుకోవాలి.

Also Read : మహేష్ బాబు డైరెక్టర్ తో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడుగా!

RELATED ARTICLES

Most Popular