Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసినవి మూడు సినిమాలే అయినప్పటికి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో ఆయన కీలకపాత్రను వహిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రభాస్ (Prabhas)తో ‘స్పిరిట్’ (Spirit)అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు మొత్తాన్ని పూర్తి చేసిన ఆయన ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్ గా మార్చాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ఆయన ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా మారుతాడు. ప్రస్తుతం ఈ సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే స్పిరిట్ సినిమా మీదకి తన డేట్స్ కేటాయించే అవకాశాలైతే ఉన్నాయి.
Also Read : సందీప్ వంగ తన సినిమాలకు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ను వాడటానికి కారణం ఏంటంటే..?
ఇక రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు స్పిరిట్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు… ఈ సినిమాలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. అలాగే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో కూడిన సన్నివేశాలు కూడా ఇందులో ఉండబోతున్నాయని సస్పెన్స్ గొలిపే అంశాలతో పాటుగా ఒక ఇంటెన్స్ డ్రామా ను సైతం ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడట.
మరి ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అంటే అభిమానులతో పాటు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ క్రియేట్ చేసిన రికార్డుని తనే తిరగరాస్తు రెండువేల కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ప్రభాస్ లైనప్ చాలా పెద్దగా ఉంది. కాబట్టి ఇక మీదట రాబోయే సినిమాతో కూడా ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అంటూ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…
Also Read : స్పిరిట్ సినిమాతో సందీప్ బాలీవుడ్ మాఫియా నోరు మూయిస్తాడా..?