Prabhas and Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్ (Sukumar)…ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నవే కావడం విశేషం…ఆర్య సినిమా నుంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ ను అందించిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ అంచలంచెలుగా ఎదుగుతున్నాడు. ఇక ఆర్య 2(Aarya 2) అయిపోయిన తర్వాత సుకుమార్ ప్రభాస్ (Prabhas ) కోసం ఒక మంచి లవ్ స్టోరీని రెడీ చేశారట. అయితే అప్పుడు ప్రభాస్ ఉన్న బిజీ వల్ల ఆ సినిమాని చేయలేకపోయాడట. మొత్తానికైతే ఇప్పటివరకు ఆ కథ ను అలానే పక్కన పెట్టి ఉంచారట. మరి ఆ సినిమాని ఇప్పుడు ప్రభాస్ తో చేస్తే వర్కౌట్ అవుతుందా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక మొత్తానికైతే ప్రభాస్ సుకుమార్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా అలా మిస్ అయిందనే చెప్పాలి. ఏది ఏమైనా కూడా సుకుమార్ ప్రస్తుతం మాస్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒకప్పుడు సెన్సిబుల్ కథలతో డిటెలింగ్ సీన్స్ రాసుకొని అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేలా తన హీరోని నెక్స్ట్ లెవెల్ లో చూపిస్తూ వచ్చాడు.
Also Read : ప్రభాస్ కోసం రాసుకున్న కథలోకి వచ్చిన స్టార్ హీరో…
కానీ ఇప్పుడు మాత్రం మాస్ బాట పట్టి ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను సైతం బ్రేక్ చేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేశాడు. మరి ఇలాంటి సందర్భంలో సుకుమార్ నుంచి రాబోయే సినిమాల మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి…
ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ (Ram Charan) తో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాలు సైతం అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మంచి కథలను ఎంచుకొని సినిమాలు గా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక రామ్ చరణ్ తర్వాత ఆయన ప్రభాస్ తో ఒక సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి అంటూ మరికొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ (Fouji) ane సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేయబోతున్న స్పిరిట్ (Spirit) సినిమాను చేసే అవకాశాలైతే ఉన్నాయి.
Also Read : సుకుమార్ రామ్ చరణ్ తర్వాత ఆ స్టార్ హీరోలతో సినిమాలు చేయబోతున్నాడా..?