https://oktelugu.com/

Arjun Reddy: అర్జున్ రెడ్డి కథ రెండే నిమిషాల్లో చెప్పాడా?

Arjun Reddy: అర్జున్ రెడ్డి.. ఒకప్పుడు నాగార్జున ‘శివ’తో ఎలా బ్రేక్ చేశాడో విజయ్ దేవరకొండ అలాగే ‘అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ అద్భుతమైన ప్రేమ కథను థియేటర్ లో చూసిన జనం షాక్ అయ్యి సూపర్ హిట్ చేశారు. నిజానికి ఈ సినిమా కథను కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రెండే నిమిషాల్లో మొదట్లోనే చెప్పేశాడు. అయితే దాన్ని ఇంతవరకూ ఎవరూ కనిపెట్టలేదట.. తాజాగా ఓ నెటిజన్లు దాన్ని కనిపెట్టి సందీప్ […]

Written By: , Updated On : October 9, 2021 / 04:24 PM IST
Follow us on

Arjun Reddy: అర్జున్ రెడ్డి.. ఒకప్పుడు నాగార్జున ‘శివ’తో ఎలా బ్రేక్ చేశాడో విజయ్ దేవరకొండ అలాగే ‘అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ అద్భుతమైన ప్రేమ కథను థియేటర్ లో చూసిన జనం షాక్ అయ్యి సూపర్ హిట్ చేశారు.

నిజానికి ఈ సినిమా కథను కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రెండే నిమిషాల్లో మొదట్లోనే చెప్పేశాడు. అయితే దాన్ని ఇంతవరకూ ఎవరూ కనిపెట్టలేదట.. తాజాగా ఓ నెటిజన్లు దాన్ని కనిపెట్టి సందీప్ రెడ్డిని ట్యాగ్ చేసి ఒక వీడియోను ప్లే చేశాడు. దాన్ని గమనించిన దర్శకుడు ‘వెల్ డన్ ’ రమేశ్.. ఇంతవరకూ దీన్ని ఎవరూ గుర్తించలేదు.. నువ్వు సూపర్ అంటూ అభినందించాడు.

అర్జున్ రెడ్డి సినిమా కథ మొత్తాన్ని ఈ సినిమా స్టార్టింగ్ లోనే రెండే నిమిషాల్లో ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్పేశాడట సందీప్ రెడ్డి వంగా.. అయితే ఈ విషయం ఇప్పటికీ ప్రేక్షకులకు అర్థం కాలేదు.. కానీ ఒక నెటిజన్ కు అర్థమవ్వడం విశేషం.

అర్జున్ రెడ్డి సినిమా ప్రారంభంలోనే హీరో విజయ్ కు నానమ్మలా నటించిన సీనియర్ యాక్టర్ తన స్నేహితురాలికి ఒక చిన్న బొమ్మ కథ చెబుతుంది. అలా చెబుతున్న సమయంలోనే సినిమా కథ అంతా రెండే నిమిషాల్లో ఆ బామ్మ మాటల్లో అర్థమయ్యేలా చెప్పాడు సందీప్ రెడ్డి వంగ.

ఎంతో మంది ఎన్నో సార్లు చూసినా కూడా ఈ విషయం ఎవరికీ తట్టలేదని.. కానీ ఒక నెటిజన్ కు మాత్రం ఈ విషయం బాగా అర్థం కావడంతో సందీప్ రెడ్డి దాన్ని ప్రస్తావిస్తూ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

-రెండు నిమిషాల్లో వివరించిన కథ ఇదే..

https://twitter.com/RameshBabloo_/status/1446694606918209538?s=20